Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ

Advertiesment
tirumala crowd today
తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై శుక్రవారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. భక్తుల రాక ఒక్కసారిగా పోటెత్తింది. గురువారం 50,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా శుక్రవారం సర్వ దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచి 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 
 
సర్వ దర్శనం భక్తులు 10 గంటలకు పైగా వేచి ఉంటేనే శ్రీవారి దర్శనం లభిస్తోంది. కాలినడక భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం తరువాత దర్శన భాగ్యం లభిస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తితిదే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu