Publish Date: Mon, 28 Mar 2016 (11:11 IST)
Updated Date: Mon, 28 Mar 2016 (11:13 IST)
నాలుగురోజుల పాటు భక్తులతో కిటకిటలాడిన తిరుమల గిరులు ప్రస్తుతం మోస్తారు భక్తుల రద్దీతో కనిపిస్తోంది. వరుసగా సెలవు దినాలు కావడంతో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలివచ్చారు. అయితే టిటిడి భక్తులందరికీ అనుకున్న సమయానికల్లా దర్శన సదుపాయం కల్పించడంతో ఆదివారం రాత్రికి భక్తులు తగ్గిపోయారు.
ఆదివారం శ్రీవారిని 89,744 మంది భక్తులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 5 గంటలకు 8 కంపార్టుమెంట్లలో ఓ భక్తులు ఉంచగా వారికి 3 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి గంటలోనే సమయం పూర్తవుతోంది. ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లుగా ఉంది.