Publish Date: Sun, 15 May 2016 (10:51 IST)
Updated Date: Sun, 15 May 2016 (11:25 IST)
తిరుమల భక్తులతో పోటెత్తింది. గత మూడు రోజులుగా ఉన్న రద్దీ కన్నా ఎక్కువగా తిరుమలలో భక్తులు కనిపిస్తున్నారు. శుక్ర, శనివారాలలో తిరుమలకు చేరుకున్న భక్తులు దర్శనం లభించకపోవడంతో ఆదివారం కూడా క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. 32 కంపార్టుమెంట్ల భక్తులతో నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక కంపార్టుమెంట్ల పరిస్థితి కూడా అదే. తిరుమలలో ఎక్కడ చూసినా జనమే.
తిరుమలలో గదులు ఖాళీ లేవు. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. శనివారం అర్థరాత్రి నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో గదులు లేక భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సర్వదర్శనం భక్తులతో పాటు కాలినడక భక్తులకు ఎన్ని గంటల్లో దర్శనం లభిస్తుందో తితిదే చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాగా, శనివారం శ్రీవారిని 88,443 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.24లక్షలుగా వసూలైంది.