ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. బంగారు రథంపై గోవిందుడు..

గురువారం, 18 అక్టోబరు 2018 (21:16 IST)
తొమ్మిదిరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ప్రతిరోజు స్వామివారు ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఒక వాహనం, రాత్రి మరో వాహనంపై ఊరేగిన కలియుగ వైకుంఠుడిని భక్తులు అధికసంఖ్యలో దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టం చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది.
 
శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య శంఖుచక్రాలను పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అంతకుముందు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. చక్రస్నాన సమయంలో అధికసంఖ్యలో భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శిరిడీ సాయి అవతారము ఎంత విశిష్టమైనదంటే?