Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

Advertiesment
Yadagiri

సెల్వి

, గురువారం, 30 జనవరి 2025 (14:27 IST)
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిపాలన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) తరహాలో ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బోర్డు ఏర్పాటుకు ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దాని ఏర్పాటు కోసం తయారు చేసిన ముసాయిదా మార్గదర్శకాలకు కొన్ని మార్పులను సూచించారు.
 
యాదాద్రి ఆలయ పాలక మండలిని నియమించడానికి నిబంధనలపై చర్చించడానికి బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమ‌ల మాదిరిగానే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలోనూ రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌న్నారు. ఆల‌య పవిత్రకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. 
 
ధర్మకర్తల మండ‌లి నియామ‌కంతో పాటు యాదగిరిగుట్ట ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్యక్రమాల్లోని ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు సీఎం రేవంత్ ప‌లు మార్పులు సూచించారు. వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాఘ గుప్త నవరాత్రి 2025: దుర్గా సప్తశతితో స్తుతించవచ్చు..