Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజాకవిత్వం ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన వెంగమాంబ : తితిదే ప్రాజెక్టు ప్రత్యేకాధికారి

Advertiesment
ప్రజాకవిత్వం ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసిన వెంగమాంబ : తితిదే ప్రాజెక్టు ప్రత్యేకాధికారి
, శనివారం, 21 మే 2016 (12:26 IST)
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులను సైతం అర్థం చేసుకునే ప్రజా కవిత్వం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని వ్యాప్తి చేశారని తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్‌.ముక్తేశ్వరరావు నొక్కివక్కాణించారు. సంకీర్తనల్లోని భావాన్ని ప్రజల బాణీలోనే తెలియజేసిన ఘనత అన్నమయ్య, వెంగమాంబకు దక్కిందన్నారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలోని శుక్రవారం తరిగొండ వెంగమాంబ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
 
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ తాళ్లపాక అన్నమయ్య తర్వాత ఆ స్థాయిలో వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకింతం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు.
 
మనసులో పెట్టి వింటే వెంగమాంబ కీర్తనల్లోని పరమార్థం తెలుసుకోవచ్చునన్నారు. ఈ సందర్భంగా తరిగొండ వెంగమాంబ జయంతిని పురస్కరించుకుని తితిదే ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ గరిమెళ్ళ బాలక్రిష్ణప్రసాద్‌ స్వరపరిచి గానం చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గీత మణిమాల, వెంగమాంబ జీవిత చరిత్రను హరికథా రూపంలో శ్రీమతి జయంతీ సావిత్రి గానం చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ (హరికథ)సిడిలను ముక్తేశ్వరరావు ఆవిష్కరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ