Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నుల పండువగా శ్రీవారి తెప్పోత్సవాలు

Advertiesment
srivari teppostavam
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన తెప్పోత్సవాలు ఐదురోజుల పాటు జరుగనున్నాయి. ఆదివారం స్వామివారు శ్రీక్రిష్ణుని రూపంలో భక్తులకు అభయమిచ్చారు. 
 
సర్వజగద్రక్షకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు రుక్మిణి సమేతంగా శ్రీ క్రిష్ణస్వామి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. అంతకు ముందు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాఢావీధులలో వైభవంగా వూరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. 
 
రాత్రి 7గంటల నుంచి విద్యుత్ దీపాలంకరణలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పలపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు. మూడవరోజు త్రయోదశినాడు మలయప్పస్వామివారు తిరుచ్చినెక్కి సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో వూరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై మూడుసార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తాడు.

Share this Story:

Follow Webdunia telugu