Publish Date: Wed, 09 Mar 2016 (09:59 IST)
Updated Date: Wed, 09 Mar 2016 (10:03 IST)
సూర్యగ్రహణం పరిసమాప్తం కావడంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచారు. ఉదయం 10 గంటలకు వేదపండితులు శ్రీవారి ఆలయ తలుపులను తెరిచారు. గ్రహణం కావడంతో నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ఆలయాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆలయ తలుపులు తెరిచిన తర్వాత ఆలయాన్ని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో శుద్ధి చేశారు.
మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సందర్భంగా సహస్త్ర దీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది. దాంతోపాటు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను కూడా టిటిడి పూర్తిగా రద్దు చేసింది. అలాగే తరిగొండ వెంగమాంబ నిత్యన్నదాన సముదాయాన్ని కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత తెరవనున్నారు. అయితే అన్నదానాన్ని మాత్రం నిలిపివేశారు.