తిరుమల భక్తులతో టీటీడీకి ఆర్థిక భారమా.. లడ్డు కూడా ఇక మాయమేనా?
ప్రతి సంవత్సరం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. కాని భక్తులకు సౌకర్యాలు కలిగించే మాట దేవుడెరుగు, దైవదర్శనం కోసం వచ్చే భక్తుల మీదే అమానుష దాడులకు తలపడి వృద్దులను సైతం చంపేస్తున్న చరిత్రను సంపాదించుకుం
భక్తిని వ్యాపారం చేసి లక్షలాది భక్తులను కొండకు రప్పించుకుని కోట్లరూపాయలను ఆర్జించడంలో దేశం మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానందే అగ్రస్థానం. ప్రతి సంవత్సరం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొండవీటి చాంతాడులా పెరుగుతూనే ఉంది. కాని భక్తులకు సౌకర్యాలు కలిగించే మాట దేవుడెరుగు, దైవదర్శనం కోసం వచ్చే భక్తుల మీదే అమానుష దాడులకు తలపడి వృద్దులను సైతం చంపేస్తున్న చరిత్రను సంపాదించుకుంటున్న టీటీడీ బోర్డు ఇప్పుడు దివ్యదర్శనం టోకెన్లపై ఇప్పటివరకూ ఇస్తున్న ఉచిత లడ్డూ పంపిణీని రద్దు చేయాలని నిర్ణయించింది.
ఖర్చుపెరుగుతోందనే మిషతో కోతలు ప్రారంభించిన టీడీడీ దైవ దర్శనం చేసుకునే ప్రతి భక్తునికి ఇస్తున్న వేలెడంత చిన్న లడ్డు ఉంటను కూడా రద్దు చేసి పడేస్తే బాగా ఖర్చు తగ్గించుకోవచ్చేమో చూడండి అంటూ భక్తులు తీవ్ర విమర్ళలు చేస్తున్నారు.
ఇంతవరకూ నడిచిన విధానం ఏమిటంటే.. నడక మార్గంలో తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ జారీ చేసే దివ్యదర్శన టోకెన్లపై ఇప్పటి వరకు ఉచిత లడ్డూ ప్రసాదం ఇస్తున్నారు. అయితే, ఇక నుంచి ఈ ఉచితానికి స్వస్తి పలకాలని అధికారులు నిర్ణయించారు. ఉచిత లడ్డూతో భారీగా నష్టం వస్తోందని, అందుకే నిలిపేయాలని నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు. దివ్యదర్శనం భక్తులకు 2014 జనవరి నుంచి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.
ఆ సమయంలో రోజుకు సరాసరి 15 వేల నుంచి 20 వేల వరకు భక్తులు కాలిబాటలో వచ్చేవారు. క్రమేణా ఆ సంఖ్య 30 వేలకు చేరింది. అదే వారాంతం, వరుస సెలవు రోజుల్లో అయితే 45 వేలు దాటుతోంది. వీరందరికీ ఒక ఉచిత లడ్డూ ఇవ్వడం వల్ల టీటీడీ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఒక రోజులో సుమారు 30 వేల లడ్డూలు ఉచితంగా ఇస్తుండడంతో టీటీడీకి రూ.10.5 లక్షల నష్టం వస్తోంది. దీంతో ఈ ఉచితాన్ని నిలిపేయాలని నిర్ణయించింది.
శతాబ్దాలుగా తిరుమల దేవుడికి సాదా సీదా భక్తులు సమర్పిస్తూ వచ్చిన టన్నుల కొద్ది బంగారం మూట గట్టుకున్న టీటీడీ ఆ భక్తులకు ఒక లడ్డు ఇవ్వడానికి కూడా కష్టమైపోయినంత పేదరాలయిపోయిందా.. ఇప్పటికే తిరుమలలో అపార్టుమెంట్లలో పశువులను కుక్కినట్లు కుక్కి వారికి ఇంత ముద్ద పడేస్తున్న టీటీడీ రేపు ఆ అన్న ప్రసాద భారం కూడా మోయలేమని చెప్పి దాన్ని కూడా రద్దు చేస్తే బోలెడంత డబ్బు ఆదా అవుతుంది కదా. అలాగా దైవ దర్శనం తర్వాత ఉచిత బోజనం కూడా అదే తీరులో రద్దు చేస్తే కొన్ని కోట్ల రూపాయల డబ్బు అలాగే పోగుపడుతుంది కదా..
స్వామి పేరుతో ఆటలాడుతున్న టీటీడీ యాజమాన్యం ఆగడాలను భక్తులు సరే.. ఆ శ్రీనివాసుడు సైతం ఇలాగే చూస్తూ ఊరకుంటాడా...