Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దిన ఫలాలు (28-06-2017) : శ్రీమతి సలహా పాటిస్తే అంతా మంచే...

మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టిసారించాలి. గృహంలో చేయు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేస

Advertiesment
daily astrology
, మంగళవారం, 27 జూన్ 2017 (20:45 IST)
మేషం
మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టిసారించాలి. గృహంలో చేయు మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఉపాధ్యాయులకు యాధృచ్చికంగానే దుబారా ఖర్చులు పెరుగుతాయి. 
 
వృషభం
ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాలగూర్చి తగాదాలు రావొచ్చు. వ్యాపార వ్యవహారాల్లో జాయింట్ సమస్యలు రావొచ్చును. కొంతమంది మీ బలహీనతలను కనిపెట్టి లబ్దిపొందాలని యత్నిస్తారు. 
 
మిథునం
ముక్కుసూటిగా పోయే మీ తీరు విమర్శలకు దారితీస్తుంది. గణిత, సైన్సు రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సి వచ్చినా చివరకు మంచే జరుగుతుంది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సంస్థల నుంచి రుణం మంజూరువుతుంది. 
 
కర్కాటకం
వాతావరణంలో మార్పు వల్ల స్త్రీ ఆరోగ్యంలో స్వల్ప తేడాలుంటాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. దైవ, సేవా కార్యక్రమాల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల మేలేజరుగుతుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
సింహం
ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి. కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. 
 
కన్య
ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు.  
 
తుల
మీ మంచితనమే మీకు శ్రీరామరక్షగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది. విద్యార్థులు బజారు తినుబండరాలు భుజించుటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవడం మంచిది కాదు. రవాణా రంగాల వారికి ఇబ్బందులు అధికమవుతాయి. 
 
వృశ్చికం
బ్యాంకుల్లో మీ పనులు స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. పెద్దల సహాయంతో ఒక సమస్యను అధికమిస్తారు. అధికారులు, తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఏదైనా అమ్మకానికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. 
 
ధనస్సు 
రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొక్కుబడులు చెల్లిస్తారు. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. 
 
మకరం
తాపి పనివారికి లాభదాయకంగా ఉంటుంది. ఎవరికైనా ధన సహాయం చేసిన ధనం తిరిగి రాజాలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
కుంభం
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి సదావకాశాలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో ఓర్పును కోల్పోతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో మనస్పర్థలు తలెత్తుతాయి. 
 
మీనం
కొబ్బరి, పండ్లు, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. దంపతుల మధ్య మనస్పర్థలు తెలెత్తుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్యాషన్ అంటూ కాలిమెట్టెలు ధరించట్లేదా? అరిగిపోయాక ఏం చేస్తున్నారు..?