Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మార్చి 9న సూర్యగ్రహణం: శ్రీవారి ఆలయం మూసివేత.. సహస్రకలశాభిషేకం రద్దు

Advertiesment
Rare astronomical event
సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మార్చి 9న మూతపడనుంది. మార్చి 9 (బుధవారం) ఉదయం 5.47 గంటల నుంచి 9.08 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీంతో తిరుమల ఆలయాన్ని దాదాపు 12 గంటల పాటు మూసివేయనున్నారు. 
 
సంప్రదాయం ప్రకారం ఆలయాన్ని 8వ తేదీ రాత్రి 8.30 గంటలకు మూసివేసి మరుసటి రోజు ఉదయం 09.30 గంటలకు తెరుస్తారు. ఆలయశుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం నిర్వహించి 10 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ నేపథ్యంలో మార్చి 9న ఉదయం జరిగే వారపు సేవ సహస్రకలశాభిషేకాన్ని రద్దు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu