Publish Date: Tue, 22 Mar 2016 (14:38 IST)
Updated Date: Tue, 22 Mar 2016 (14:40 IST)
తిరుమలలో భక్తులు కనిపించడం లేదా.. ఇదేంటి వైరైటీగా ఉందనుకుంటున్నారా..నిజమేనండి. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతుండే తిరుమల ప్రస్తుతం భక్తులు లేక ఖాళీగా కనిపిస్తోంది. క్యూలైన్లతో పాటు కంపార్టుమెంట్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సర్వదర్శనం భక్తులకు కేవలం గంటలన్నర వ్యవధిలోనే దర్శనం పూర్తవుతోంది.
మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా, కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. కాలి నడక భక్తులతో పాటు సర్వదర్సనం భక్తులకు కేవలం గంటన్నరలోనే శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. నిన్న శ్రీవారిని 66,656 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 3కోట్ల 5లక్షల రూపాయల రూపాయలు వచ్చింది.
కలియుగ వైకుంఠాన్ని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో ఆయన పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను టిటిడి అధికారులు అందజేశారు.