Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపట్ల జిల్లా చెరువు జమ్ములపాలెంలోని తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో మహాప్రతిష్ట

Anjaneya
, మంగళవారం, 31 మే 2022 (23:28 IST)
బాపట్ల జిల్లా చెరువు జమ్ములపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం రెండు కోట్ల రూపాయలు పైబడి నిర్మింపబడిన అమ్మవారి దేవస్థానం నందు జూన్ నెల రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిష్ట ఏర్పాట్లన్నీ కూడా శీఘ్రంగా జరుగుతున్నాయి. భక్త మహాశయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు తగినన్ని సౌకర్యాలు ఏర్పాట్లు జరుగుతున్నవి.

 
గ్రామ ప్రజలు గ్రామ యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నాలుగో తేదీ శనివారం ఉదయం 07:56 నిమిషాలకు 24 ప్రతిష్టలు 27 మంది ఋత్విక్కులు ఈ ప్రతిష్ట మహోత్సవాలు శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ అంకమ్మ తల్లి చదువుల తల్లి సరస్వతి సంతాన సుబ్రమణ్యేశ్వర స్వామి నాగేంద్ర స్వామి అభయ ఆంజనేయ స్వామి శ్రీ మహా మృత్యుంజయ స్వామి ఆదిత్య నవగ్రహాలు మహా శివలింగ ప్రతిష్ట శ్రీ చక్ర సహితంగా కలిపి 27 మంది రుత్వికలచే మహా ప్రతిష్ఠ జరుగుతుంది.

 
నూతన దేవాలయాలు మహా ప్రతిష్ట మహోత్సవం అనంతరం ఈ దేవాలయం శ్రీ త్రిశక్తి దేవాలయంగా మారుతుంది. కాబట్టి వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నాలుగో తేదీ ఉదయం 10 గంటల నుండి నిర్వహించడం జరుగుతున్నది. రెండో తేదీ నుంచి జరిగే కార్యక్రమం వివరాలు వేదమంత్రాలతో ఆలయప్రవేశం గోపూజ విగ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం వాస్తు పూజ గ్రహణం ప్రసాద వినియోగం, మూడో తేదీ శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి నిత్య పూజ ఆదిత్యాది నవగ్రహ హోమం త్రిశక్తి పూజ వాసం, నాలుగో తేదీ శనివారం ఉదయం 6 గంటల నుంచి నిత్య పూజ పూజ ప్రాణప్రతిష్ఠ పూర్ణాహుతి ఈ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం శాంతి కళ్యాణం అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ఉదయం మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఐదో తేదీ అమ్మవారికి ప్రీతిపాత్రమైన పొంగళ్ళు కార్యక్రమం జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

01-06-2022 నుంచి 30-06-2022 వరకూ మీ మాస ఫలితాలు