Publish Date: Sat, 02 Apr 2016 (12:11 IST)
Updated Date: Sat, 02 Apr 2016 (12:13 IST)
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీనటుడు రాజ్‌తరుణ్, రక్షితతో పాటు వైసిపి నాయకుడు మిథున్ రెడ్డిలు స్వామిసేవలో పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికారు. రంగనాయకమండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ ప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. క్యూలైన్లలో భక్తులు సినీనటులకు కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు.
మరోవైపు... యువనటుడు రాజ్‌తరుణ్ తిరుమలలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన రాజ్‌తరుణ్ క్యూలైన్‌లో ఆలయం లోపలికి ప్రవేశించగానే మహద్వారం వద్ద కళ్ళుతిరిగి కూర్చుండిపోయారు. 15 నిమిషాలకుపైగా ఆలయం వద్ద కూర్చుండి పోయారు. కొద్దిసేపటి తర్వాత రాజ్‌తరుణ్ ఆలయం ముందే వాంతులు చేసుకున్నారు. దీంతో తితిదే అధికారులు కొద్దిసేపు మహద్వారం వద్దే రాజ్‌తరుణ్‌ను కూర్చోబెట్టారు. చాలా సేపటి తర్వాత రాజ్‌తరుణ్ తిరుమల ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు.