Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

ఒక గ్లాసు నీళ్ళలో ఆ ఒక్కటి వేస్తే మీరు కోటీశ్వరులే...!

నరుడు దృష్టి తగిలితే నల్లరాయి అయినా పగిలిపోతుందంటారు. ఇది చాలా మంది నమ్మకం కూడా. కొంతమంది దీన్ని నమ్ముతున్నారు కూడా. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ నర ఘోష బారిన పడతారని కొంతమంది చెబుతూ ఉంటారు. అల

Advertiesment
lemon benefits
, ఆదివారం, 20 ఆగస్టు 2017 (14:21 IST)
నరుడు దృష్టి తగిలితే నల్లరాయి అయినా పగిలిపోతుందంటారు. ఇది చాలా మంది నమ్మకం కూడా. కొంతమంది దీన్ని నమ్ముతున్నారు కూడా. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఈ నర ఘోష బారిన పడతారని కొంతమంది చెబుతూ ఉంటారు. అలాంటి వారు ఈ దోషం నుంచి తప్పించుకుని ధనాన్ని సంపాదించుకునేందుకు నిమ్మకాయ ఉపయోగపడుతుందని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు.
 
మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. అందులో ఉండే విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుందనేది తెలిసిందే. ఇదొకటే కాదు ఆధ్మాత్మికపరంగా కూడా ఉపయోగిస్తారంటే అతిశయోక్తి కాదు. అలాగే నిమ్మ కాయలకు దృష్టి దోషాలను తొలగించే అతీతశక్తులున్నాయని చాలా మంది నమ్మకం. చాలామంది వ్యాపారస్తులు ఇప్పటికీ ఇక గాజు గ్లాసులో నీళ్ళు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి దేవుని ఫోటోల వద్ద ఉంచుతుంటారు.
 
కొంతమంది వ్యాపారస్తులు తమ షాపుల ముందు అంటే గుమ్మం ముందు పైభాగంలో నిమ్మకాయలను వేలాడకడతారు. అలా చేస్తే తమ షాపును నాశనం చేయాలన్న దుష్టశక్తుల నుంచి కాపాడుకుంటున్నామనేది షాపు యజమానుల నమ్మకం. మంత్రతంత్రాల్లో నిమ్మకాయది ప్రధాన పాత్రగా భావిస్తారు. అలాగే గురువారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి నాలుగు నిమ్మకాయలు, లవంగాలను పూజ చేయడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 
ఇంటి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉంటే ఎలాంటి దుష్టశక్తులు దరిచేరవని శాస్త్రం చెబుతోంది. వ్యాపారాల్లో నష్టం ఉంటే ఒక నిమ్మకాయను షాపు గోడలకు అద్ది ఆ నిమ్మకాయను నాలుగు దబ్బలుగా చేసి ఒక్కో మూల విసిరిపారేస్తే ఆ తర్వాత లాభాలేనట. అలాగే ఇంటి ఆవరణలో వాస్తు దోషం ఉంటే నిమ్మచెట్టును పెంచితే మంచిదట. హాల్లో ఒక గాజుగ్లాస్‌లో నీళ్ళు పోసి ఒక నిమ్మకాయను అందులో వేసి హాలులో ఉంచితే దుష్టదోషాలు పోయి ధనం దానికదే పరిగెత్తుకొస్తుందట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : మీ రాశి ఫలితాలు 20-08-17