Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 18న కోదండ రామాలయంలో కళ్యాణోత్సవం

Advertiesment
kodandarama temple kalyanotsavam
తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయంలో ఈ నెల 18వ తేదీన కళ్యాణోత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్వహించింది. తిరుపతి కోదండ రామస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం కావడంతో ఎంతో వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి ధార్మిక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. శ్రీరామ చంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో కళ్యాణోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తూ వస్తోంది.
 
ఉదయం 11 గంటలకు స్వామి వారి కళ్యాణాన్ని టిటిడి వేదపండితులు వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేయనున్నారు. అలాగే అదేరోజు సాయంత్రం నాలుగు మాడవీధుల్లో స్వామి, అమ్మవార్లను వూరేగించనున్నారు. శ్రీరామ చంద్రపుష్కరిణిలో వూంజల్‌ సేవను కూడా టిటిడి నిర్వహించనుంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులు సాంప్రదాయ వస్ర్తధారణలో రావాలని టిటిడి అధికారులు కోరారు.

Share this Story:

Follow Webdunia telugu