సింహాచలం కొండపై శంఖు చక్ర నామాలు కొండకు హైలెట్‌గా నిలిచాయి. నేషనల్ హైవేపై ప్రయాణించే వారికి సైతం కనిపించే విధంగా వీటిని ప్రతిష్ఠించారు. శంకు చక్ర నామాలు ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తాయని ఆలయ వేద పండితులు తెలిపారు. ఓ జ్యువెలరీ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేశారు.
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్న సింహాచలం కొండపై శంకు, చక్ర, నామం ఆదివారం ఏర్పాటు అయ్యింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు పర్యవేక్షణలో జిఆర్‌టి జువెలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విరాళంగా అందించిన 'శంకు, చక్ర, నామం', వాటికి మద్దతు ఇచ్చే నిర్మాణాలను రూ.1.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశారు.
అనంతరం అశోక్ గజపతి రాజు జిఆర్‌టి జ్యువెలర్స్ చైర్మన్ జి రాజేంద్రన్, మేనేజింగ్ డైరెక్టర్లు అనంత పద్మనాభన్, రాధాకృష్ణన్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, కార్పొరేటర్ పి.వరహనరసింహం తదితరులు పాల్గొన్నారు.