Publish Date: Sat, 26 Mar 2016 (10:13 IST)
Updated Date: Sat, 26 Mar 2016 (10:15 IST)
జనం.. ఎటు చూసినా జనమే. ఇసుకేస్తే రాలనంత జనం... ఇది తిరుమల గిరుల్లో భక్తుల సందడి. నాలుగు రోజులుగా వరుస సెలవు దినాలు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. తిరుమలలోని జిఎన్‌సి టోల్‌గేట్ నుంచి ప్రతి కాటేజీ, టిటిడి కార్యాలయాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది. గదులు ఖాళీలేవంటూ టిటిడి ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ స్క్రీన్‌లలో కనిపిస్తున్నాయి.
దీంతో భక్తులు రోడ్లపైనే భక్తులు సేదతీరుతున్నారు. తిరుమలలో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎండవేడిని భక్తులు తట్టుకోలేకపోతున్నారు. షెడ్లతో పాటు చెట్ల కింద భక్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే గార్డెన్ లోపల కూడా భక్తులు సేదతీరుతున్నారు. తిరుమలలోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి 4 కిలోమీటర్ల మేర క్యూలైన్ బయటకు వచ్చేసింది.
సర్వదర్సనం భక్తులకు 20 గంటలకుపైగా సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 62,577 మంది దర్శించుకోగా హుండీ ఆదాయం 3 కోట్ల 27 లక్షల రూపాయల రూపాయలు వచ్చింది.