యాదగిరిగుట్ట మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. దీంతో 23వ తేదీ వరకు ఆలయంలో భక్తులచే జరిపే సుదర్శన నరసింహ హోమం రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
ఇక బుధవారం ఉదయం 7.45 గంటలకు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సాయంత్రం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, అఖండ దీప ప్రజ్వలన, అంకురార్పణ, ద్వార తోరణం ధ్వజ కుంభారాధన, అంకురార్పణ హోమం జరుగుతుంది.
ఐదు రోజుల పాటు వానమామలై మఠం పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 108 మంది ఋత్వికులతో పంచకుండాత్మక యాగం జరుగుతుంది.