Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మావతి అమ్మవారి సేవలో గవర్నర్‌: గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

పద్మావతి అమ్మవారి సేవలో గవర్నర్‌: గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలపై సమీక్ష
, సోమవారం, 9 మే 2016 (18:25 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ దర్సించుకున్నారు. సతీమణి విమలా నరసింహన్‌‌తో కలిసి అమ్మవారి సేవలో గవర్నర్‌ పాల్గొన్నారు. ఆలయం వద్ద తితిదే వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పట్లు చేశారు. మండపంలో అమ్మవారి తీర్ధప్రసాదాలను తితిదే అధికారులు అందజేశారు. మంగళవారం తిరుమలలో శ్రీ రామానుజ సహ్రస్తాబ్ధి ఉత్సవాలను గవర్నర్‌ ప్రారంభిస్తారు.
 
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలపై తితిదే జెఈఓ సమీక్ష 
తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు మే 14వతేదీ నుంచి 22వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలపై తిరుపతి తితిదే జెఈఓ పోలా  భాస్కర్‌ ఆలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా జెఈఓ మాట్లాడుతూ 13వతేదీ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, మే 14వతేదీ ధ్వజారోహణం, మే 18న గరుడవాహణం, మే 21న రథోత్సవం, మే 22వతేదీ చక్రస్నానం జరుగుతాయని తెలిపారు. 
 
రథోత్సవంలో ఇబ్బంది లేకుండా ఆలయ నాలుగు మాఢా వీధుల్లో చెట్ల కొమ్మలు, విద్యుత్‌, టెలిఫోన్‌ వైర్లు తొలగించారని, ఇందుకోసం ఎస్‌పిడిసిఎల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. వాహనసేవల సమయాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రధాన రహదారుల్లో ఆర్చీలు, స్వామివారి వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్‌ విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. 
 
ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుత్‌ దీపాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని కోరారు. తగినంత మంది శ్రీవారి సేవకులతో క్యూలైన్ల క్రమ బద్ధీకరణ చేపట్టాలని సూచించారు.  ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా భజనలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం జెఈఓ అధికారులతో కలిసి క్యూలైన్లు, వాహన మండపం, ఆలయంలో జరుగుతున్న వివిధఅభివృద్ధి పనులను పరిశీలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేపటి నుంచి తిరుపతి గంగమ్మ జాతర.. శ్రీవారి చెల్లెలుగా ప్రసిద్ధి...