తిరుమలలో అపశృతి-మాడ వీధుల్లో ఏనుగు ఏం చేసిందంటే..?
తిరుమల శ్రీవారి గరుడ వాహనసేవలో అపశృతి చోటుచేసుకుంది. వాహనసేవలో వెళుతున్న గజరాజు ఒక్కసారిగా బెదిరింది. గోశాల నుంచి మాఢా వీధుల్లోకి వస్తున్న సమయంలో ఉత్తర మాడవీధిలో ఘటన జరిగింది. భక్తుల గోవింద నామాల శబ్ధ
తిరుమల శ్రీవారి గరుడ వాహనసేవలో అపశృతి చోటుచేసుకుంది. వాహనసేవలో వెళుతున్న గజరాజు ఒక్కసారిగా బెదిరింది. గోశాల నుంచి మాఢా వీధుల్లోకి వస్తున్న సమయంలో ఉత్తర మాడవీధిలో ఘటన జరిగింది. భక్తుల గోవింద నామాల శబ్ధానికి భయపడి, బిగ్గరగా ఘీంకరించింది గజరాజు పద్మజ.
హఠాత్తుగా ఏనుగు బెదరడంతో క్రిందకు జారిపడ్డాడు మావటి. వెంటనే అప్రమత్తమైన గజరాజును అదుపుచేశారు మావటీలు. భక్తులు గోవిందా... గోవిందా.. అంటూ నామస్మరణలు చేయడంతో గజరాజు భయపడింది. ఏనుగు పెద్ద శబ్థంతో అరవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. గరుడ వాహనసేవలో ఇలాంటి సంఘటన జరుగడం ఇదే తొలిసారి.