Publish Date: Sun, 27 Mar 2016 (11:30 IST)
Updated Date: Sun, 27 Mar 2016 (11:33 IST)
తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో దూకి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన భక్తుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తో గుర్తించలేకపోతున్నారు. మృతుని షర్టులో గానీ ప్యాంటు జేబులో గాని ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదు. రెండురోజుల క్రితమే గుర్తుతెలియని భక్తుడు శ్రీవారి పుష్కరిణిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటానని పోలీసులు భావిస్తున్నారు.
ఆదివారం ఉదయం పుణ్యస్నానానికి వెళ్ళిన భక్తులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే ఒక భక్తుడు పుష్కరిణిలో దూకి ఆత్మహత్య చేసుకునేంత వరకు పోలీసు, నిఘా, విజిలెన్స్ విభాగం ఏం చేస్తుందోనని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భక్తుని ఆత్మహత్య చర్చనీయాంశంగా మారుతోంది.