Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తులకు మజ్జిగ పంపిణి - తాగినవారికి తాగినన్ని గ్లాసులు

Advertiesment
buttermilk distribution to ttd devotees
సూర్యభగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో తిరుమల కొండపై ఉండే భక్తులు ఎండ వేడికి తల్లడిపోతున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం తిరుమలలో మజ్జిగను పంపిణీ చేస్తోంది. 
 
సర్వ దర్శనంతోపాటు కాలినడకన వచ్చే భక్తులు, శీఘ్ర దర్శనంకు వెళ్ళే భక్తులకు మజ్జిగను తితిదే అధికారులు, సేవకులు అందిస్తున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు భక్తులకు ఎన్ని గ్లాసులు తాగితే అన్ని గ్లాసుల మజ్జిగను తితిదే అందిస్తోంది.
 
ఆదివారం నుంచే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని టిటిడి కార్యనిర్వహణాధికారి జెఇఓ శ్రీనివాసరాజు ప్రారంభించారు. స్వయంగా ఆయనే భక్తులను మజ్జిగను పంపిణీ చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు స్వయంగా వెళ్ళి మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. టిటిడి మజ్జిగ పంపిణీపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu