Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలపై అమ్మ ఎఫెక్ట్... గంటలోపే తిరుమలేశుని దర్శనం...

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తమిళీయులే ఉంటారు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు దర్శించుకుంటే అందులో 40 శాతం మంది తమిళీయులే ఉంటుంటారు. తమిళనాడు నుంచే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. తమిళులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్యద

తిరుమలపై అమ్మ ఎఫెక్ట్... గంటలోపే తిరుమలేశుని దర్శనం...
, బుధవారం, 7 డిశెంబరు 2016 (14:40 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువమంది తమిళీయులే ఉంటారు. ప్రతిరోజు 50 వేల మంది భక్తులు దర్శించుకుంటే అందులో 40 శాతం మంది తమిళీయులే ఉంటుంటారు. తమిళనాడు నుంచే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. తమిళులకు వెంకటేశ్వరస్వామి ఆరాధ్యదైవం. సాధారణ సమయాల్లో తమిళులు ఈ స్థాయిలో వస్తే రద్దీ సమయాల్లో చెప్పనవసరం లేదు. కోవిందా....(గోవిందా) కోవిందా అంటూ తిరుమలకు చేరుకుంటుంటారు. ఎక్కువమంది భక్తులు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు కాలినడక వచ్చి స్వామివారికి మ్రొక్కులు సమర్పిస్తుంటారు.
 
అలాంటి తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ కనిపించడం లేదు. కారణం అమ్మ ఎఫెక్ట్. అమ్మ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. తమిళీయులు అమ్మగా భావించే జయలలిత. ఆమె మరణంతో ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రం మూగబోయింది. అమ్మను కోల్పోయామన్న బాధలో ఉన్న తమిళీయులు ముభావంగా కూర్చుండిపోయారు. కన్నీంటి పర్యాంతమవుతూ జయ చనిపోయిందన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నారు. దీంతో నిన్నటి నుంచి కూడా తమిళ నాడు నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. బుధవారానికైతే కాలినడక భక్తులు అసలు  కనిపించడం లేదు. కంపార్టుమెంట్లు ఖాళీగా ఉన్నాయి.
 
ఇదంతా చూస్తున్న తితిదే ఉన్నతాధికారులకు అన్నీ అర్థమైపోయింది. అంతా అమ్మ ఎఫెక్టేనని. ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనానికి 5 గంటలు, కాలినడక దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అంత తొందరగా దర్శనం జరుగుతుంటే సామాన్యభక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. మరో వారంపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని తితిదే భావిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా పెరిగిన శ్రీకాళహస్తి ఆదాయం... రాబడి రూ.3 కోట్లు..అన్నీ పాత నోట్లే..!