Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?

Advertiesment
Dhanvantari

సెల్వి

, సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (19:03 IST)
Dhanvantari
ధన్వంతరి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ధన్వంతరి అంటే ఆరోగ్య దేవత అని అర్ధం. ధన్వంతరి ఆయుర్వేద వైద్యుడు. ప్రపంచంలోనే తొలి శస్త్ర చికిత్స చేసిన మహానుభావుడు ధన్వంతరి. ఉత్తర భారతంలో ధన్వంతరికి ఆలయాలు పెద్దగా లేవు. దక్షిణ భారతంలో ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి. 
 
ముఖ్యంగా తమిళనాడులోని వైతీశ్వరన్ ఆలయంలో చాలాకాలం తపస్సు చేసి అక్కడే ధన్వంతరి జీవ సమాధి అయినట్లు పురాణాలు చెప్తున్నాయి. ధన్వంతరిని స్తుతించడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం. అందుకే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఆయన నామాన్ని 108 సార్లు పఠించాలి.
 
ధ్యానం కోసం సరైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ధన్వంతరి ఫోటోను ఉంచి, నేతి దీపం వెలిగించాలి. ధన్వంతరి సిద్ధ పురుషుడిని పూజించేటప్పుడు పునర్వసు నక్షత్రాన్ని ఎంచుకోవచ్చు. ధన్వంతరి జీవితకాలం దాదాపు 800 సంవత్సరాల 32 రోజులు. అతనికి వందలాది మంది శిష్యులు, నంది గురువుగా ఉన్నారు. సూర్యుని 16 శిష్యుల్లో ధన్వంతరి ఒకరు. కర్మానుసారం ఒక వ్యక్తి తమలో సంభవించే అనారోగ్యం నుండి బయటపడటానికి ధన్వంతరిని పూజించవచ్చు. 
 
ఆయన రాసిన వివిధ పుస్తకాలలో, అత్యంత ప్రసిద్ధమైనవి ధన్వంతరి వైద్యచింతామణి, ధన్వంతరి దండగం. ఆయన పుస్తకాలలోని వైద్య చిట్కాలు ఒక వ్యక్తి జీవిత కాలాన్ని పొడిగించగలవు.
 
ఓం నమో భగవతే వాసుదేవాయ!
ధన్వంతరయే అమృత కలశ హస్తాయ 
వజ్ర జలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః అంటూ ఆ ధన్వంతరిని ప్రార్థిస్తే ఆరోగ్యానికి లోటుండదు. దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిబ్రవరి 12న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ.. భక్తుల రద్దీ