Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో గొల్ల మండపం తరలింపు... భగ్గుమన్న యాదవ సంఘాలు

తిరుమలలో గొల్ల మండపం తరలింపు... భగ్గుమన్న యాదవ సంఘాలు
, శనివారం, 21 డిశెంబరు 2019 (16:05 IST)
అది గొల్లమండపంగా ప్రసిద్ధి గాంచింది బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ప్రధాన ఆలయం ముందు ఉంది ఇప్పుడు దీనిని అక్కడ నుంచి తరలిస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో కలకలం రేగింది. దీనిపై ముఖ్యంగా యాదవ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నాయి. 
 
ప్రస్తుతం గొల్లమండపం బలహీనంగా ఉందని, ఏ క్షణంలోనైనా కూలే అవకాశముందని పేర్కొంటూ తరలించేందుకు టీటీడీ అధికారులు సన్నిధిగొల్ల కుటుంబ సభ్యులను కోరినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్మాణం కేవలం సన్నిధిగొల్ల కుటుంబాలకు చెందినది మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాదవుల మనోభావాలకు చెందిన అంశమంటూ యాదవులు ఆగ్రహిస్తున్నారు. గొల్లమండపాన్ని అంగుళం కదిలించినా జాతీయస్థాయిలో ఆందోళనకు వెనుకాడబోమని వారు హెచ్చరిస్తున్నారు. గొల్లమండపాన్ని అక్కడే ఉంచుతామని టీటీడీ వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
గొల్లమండపం చరిత్ర 
అందులో ప్రధానంగా పూర్వకాలంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవాలు తిరుచానూరులో జరిగేవట. 
అయితే స్వామికి చెందిన ఉత్సవాలు, ఊరేగింపులు తిరుమల క్షేత్రంలోనే జరగాలని రామానుజాచార్యులు తీర్మానం చేశారు. అందులో భాగంగానే తిరుమల కొండను అభివృద్ధి చేయాలని వైష్ణవ స్వాములను రామానుజాచార్యులు ఆదేశించారట. ఈ క్రమంలో ఆయా పనుల్లో నిమగ్నమైన కూలీలకు, పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు చంద్రగిరికి చెందిన గొప్పమ్మ అనే గొల్లవనిత మజ్జిగ ఇచ్చి దాహం తీర్చేదట. 
 
ఆమె సేవను ప్రశంసించిన రామానుజాచార్యులు శ్రీనివాస పరబ్రహ్మ ముక్తిని ప్రసాదించుగాక అంటూ ఓ తాటాకును ఆమె చేతిలో పెట్టారట. ఆ క్రమంలోనే ఆ గొల్లవనితకు గుర్తుగా గొల్ల మండపాన్ని నిర్మించారనే కథనం ప్రచారంలో ఉంది.
 రామానుజాచార్యుల ఆదేశాల మేరకు జరిగిన పలు మండపాలు, ఆలయం చుట్టూ వీధులు, మఠాల నిర్మాణాలను చూసిన గొల్ల వనిత తాను పాలు, పెరుగు విక్రయించగా వచ్చిన సొమ్ముతో తానే గొల్లమండపాన్ని నిర్మించిందని కూడా చెబుతారు.
 
తరలింపు అంశం ఇప్పటిది కాదు 
తొలుత గొల్లమండపం వెయ్యికాళ్ల మండపానికి అనుకుని ఉండేది. ఉత్సవాల సమయంలో వెయ్యికాళ్లమండపం వద్ద ఇరుకుగా ఉండి రథోత్సవం సమయంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందటం, పలువురు గాయపడడం దరిమిలా దశలవారీగా 2003 నాటికి వెయ్యికాళ్లమండపాన్ని తొలగించారు. కానీ గొల్లమండపం జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయలేదు. కాగా, 2006లో గొల్లమండపాన్ని కూడా అక్కడి నుంచి తరలించాలని టీటీడీ భావించింది. ఈ క్రమంలో యాదవుల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. 
 
తరలించకూడదంటూ కొందరు యాదవులు అదే ఏడాది కోర్టు నుంచి స్టే కూడా తీసుకువచ్చారు. ఆ తర్వాత మండపం నాలుగు దిక్కుల్లో సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేసి నిఘా ఉంచారు. 2008 తర్వాత అప్పటి పాలకమండలి గొల్లమండపం తరలింపు అంశంపై దృష్టిపెట్టింది. నిపుణుల ఆదేశాల మేరకు గొల్లమండపం చాలా బలహీనంగా ఉందని, వెంటనే అక్కడి నుంచి తరలించాలని భావించారు. వీటితో పాటు వాహనసేవల సమయంలో కూడా ఇబ్బందిగా ఉంటోందని యోచించారు.
 
పూర్తిస్థాయిలో తొలగించబోమని, అఖిలాండం వద్ద తిరిగి నిర్మిస్తామని పలువురు యాదవ కులస్థులతో సమావేశమై ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆ నిర్ణయాన్ని యాదవులు ఒప్పుకోలేదు. అదే స్థలంలో గొల్లమండపానికి మరమ్మతులు చేయాలని సూచించారు. దీంతో టీటీడీ అధికారులు అప్పట్లో గొల్లమండపానికి ఉన్న నాలుగు స్తంభాలకు ఇనుప రాడ్లతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. కాగా, గొల్లమండపం తరలింపు అంశంపై గతేడాది టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు వ్యాఖ్యలు చేయటం సంచలనమైంది. సన్నిధిగొల్ల, గొల్లమండపం రెండు అంశాలు తిరుమల ఆలయంతో పెనవేసుకున్నవని, వాటిని ఏరకంగానూ ముట్టుకునే హక్కు ప్రభుత్వాలకు లేదని ఆయన పేర్కొన్నారు.
 
గొల్లమండపం జోలికి రావద్దు 
ప్రధానమైన ఆలయ గోపురం ముందు ఈ మండపాన్ని నిర్మించారంటే ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవాలి. మా గుర్తుగా ఉన్న గొల్లమండపం జోలికి రావద్దు. గొల్లమండపం తరలింపు అంశం మరోసారి ప్రస్తావనకు రాకుండా ప్రస్తుత టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశంపై త్వరలోనే టీటీడీ చైర్మన్‌ను కలుస్తాం. 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తే గొల్లమండపం కూలిపోతుందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. తిరుమలలో కనీసం 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలి వీచే పరిస్థితి లేదు. గొల్లమండపానికి మరమ్మతులు చేయాల్సి వస్తే యాదవులందరూ కలిసి మరమ్మతులు చేయించేందుకు సిద్ధంగా ఉన్నాం. మండపాన్ని తరలించాలని చూస్తే ఉద్యమాలు చేయడానికి కూడా వెనకాడబోము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

21-12-2019 శనివారం మీ రాశి ఫలితాలు (video)