మార్గశిర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించినట్లైతే సర్వశుభాలు చేకూరుతాయి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అని అంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆర్థికంగా బావుంటుంది, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. లక్ష్మీకటాక్షంతో ఆనందంగా ఉండొచ్చు.
మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, పురోగతిని కూడా అమ్మవారు మనకు ప్రసాదిస్తారు. వరలక్ష్మీ వ్రతం ఎలా అయితే శ్రావణ మాసంలో చేసుకుంటారో, మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారంనాడు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు తామర పూలను సమర్పించాలి.
తామర పూలను సమర్పించడం వలన ధన సంబంధిత సమస్యలు తొలగిపోయి ఆనందం, శాంతి కలుగుతాయి. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది.
ఎర్రటి మందారాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే శ్రేయస్సు కలుగుతుంది. అదృష్టం ఉంటుంది. లక్ష్మీదేవికి ఈ పువ్వులు ఎంతో ఇష్టం. సంపద, ఆనందం, శాంతిని పొందవచ్చు. వ్యాపారాల్లో కూడా వృద్ధి కనపడుతుంది.