శుక్రవారం నాడు ధనానికి అధిపతి శ్రీలక్ష్మితో పాటు శుక్రుడు పాలిస్తారని చెప్తారు. ఈ శుక్రవారం రోజున వచ్చే ప్రదోషాన్ని ఐశ్వర్య ప్రదోషం అంటారు. శుక్రవారం నాడు వచ్చే ప్రదోషం మీ ఆర్థిక ఇబ్బందులను మార్చేస్తుంది. జీవితంలో ప్రతికూలతలను ఇది తొలగిస్తుంది. జీవితంలో ప్రగతిశీల మార్పును తీసుకురావడానికి సహాయపడుతుందని వేద గ్రంథాలు చెబుతున్నాయి.
గత చెడు కర్మల నుంచి శుక్ర ప్రదోషం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఇందుకోసం శుక్రవారం వచ్చే ప్రదోష వేళలో శివలింగానికి, నందీశ్వరుడికి జరిగే అభిషేకాలను కనులారా వీక్షించాలని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ప్రదోష సమయంలో నీలకంఠ స్తోత్రం పఠించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.
ఈ నీలకంఠ మంత్రాన్ని పఠించడం వల్ల కర్మ ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రవారం పూట 13 దీపాలను శివునికి వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.