Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మానవరూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉన్న శివలింగం.. తిరుమల గిరుల్లో...

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతి పురాతనమైన శివలింగం చిత్తూరు జిల్లాలో ఉంది. అది కూడా సాక్షాత్తు తిరుమల వెంకన్న కొలువైన తిరుపతిలోనే. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నడుపబడుతున్న గుడిమల్లం ఆలయం తిరుపతికి 20 కిలో

మానవరూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉన్న శివలింగం.. తిరుమల గిరుల్లో...
, సోమవారం, 4 జులై 2016 (16:03 IST)
ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతి పురాతనమైన శివలింగం చిత్తూరు జిల్లాలో ఉంది. అది కూడా సాక్షాత్తు తిరుమల వెంకన్న కొలువైన తిరుపతిలోనే. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నడుపబడుతున్న గుడిమల్లం ఆలయం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది పూర్వం 1వ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు.
 
1911 సంవత్సరంలో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాడు. గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ఈ గర్భాలయముల అంతరాలయమున, ముఖ మండపము కన్నా లోతులో ఉంటుంది. ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్టించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చెయ్యబడిన మానష లింగం. 
 
సుమారుగా ఐదు అడుగుల ఎత్తు ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. లింగంపైన ముందు వైపు ఉబ్బెత్తుగాను లింగం నుండి బయటకు పొడుచుకు వచ్చినట్లు చెక్కబడిన శివుడురాతితో చెయ్యబడిన మానష లింగం సుమారుగా ఐదు అడుగుల ఎత్తు ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుంది. లింగంపైన ముందు వైపు ఉబ్బెత్తుగాను లింగం నుంచి బయటకు పొడుచుకు వచ్చినట్టు చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుడు భుజాలపై నిలబడిన రూపంలో ఉన్నాడు. 
 
కుడి చేతిలో ఒక గొర్రెపోతు యొక్క కాళ్ళు పట్టుకొనగ ఎడమచేతితో చిన్నగిన్నేను పట్టుకున్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగలించుకుని స్వామి జటాభార తలకట్టుతో చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ రకాల ఆభరణాలు ధరించి నడుము చుట్టూ మధ్యలో క్రిందకు వేలాడుతున్నట్లు ఉన్న అర్థోకము ధరించి ఉన్నాడు. ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న మడతలు అతి సృష్టముగా కనిపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవితం లేకపోవడం విశేషం. ఈ లింగం అతి ప్రాచీనమైన లింగంగా గుర్తించబడింది. 
 
ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించడబడినది. ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన త్రవ్వకాలలో ప్రస్తుతానికి పూర్వం రెండవ శతాబ్థానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలం లేదా పూర్వం 2 లేదా 3వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు.
 
ఈ దేవాలయంకు తూర్పున ధ్వజస్తంభం ఉంది. కానీ ద్వారం లేదు. కానీ ఒక కిటికీ లాంటిది బండకు మూడు వరుసలో రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాల గుండా సూర్యకిరణాలు దేవుడి పాదాలపై జూన్‌ 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మాత్రమే పడుతాయి. ప్రతి 60సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నది సొరంగం ద్వారా స్వామివారికి అభిషేకం చేసి వెళుతుందని పురాణాలు చెబుతున్నాయి. సొరంగంలోపల గర్భాలయం ఉంది. ఈ సొరంగం శ్రీకాళహస్తి నుండి ఉంది అని ఆర్కియాలజీ వారి నిర్థారించారు. 
 
ఈ దేవాలయం గజపుష్ట ఆకారంలో దక్షిణ ద్వారం కలిగి ఉంది. చుట్టూ ఒక్క ద్వారం కూడా లేదు. పై నుంచి కొన్ని సందులు వదిలారు గాలి వెలుతురు కోసం ఇటువంటి దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేదు అని గంటా పదంగా పురాతత్వశాఖ వారు చెబుతున్నారు. చంద్రగిరి కోటలో గల పురావస్తు ప్రదర్శనాలయంలో లభ్యమవుతుంది. ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరమాత్మా క్షమించు... తిరుమలలో సినిమా పాటలు... తితిదే బ్రాడ్‌ కాస్టింగ్‌ లీలలు అన్నీఇన్నీకావు...