Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?

ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేక ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. అలాగే, కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు

ఆషాఢంలో కొత్తజంటను ఎందుకు వేరుచేస్తారో తెలుసా?
, సోమవారం, 3 జులై 2017 (12:28 IST)
ఆషాఢ మాసానికి ఎంతో ప్రత్యేక ఉంది. వర్షాకాలానికి ఆరంభం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. అలాగే, కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలను దూరంగా ఉంచుతారు. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి.
 
సాధారణంగా పెళ్లయిన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూదని పెద్దలు చెబుతుంటారు. అందుకే కొత్తగా పెళ్లయిన కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢమాసంలో కోడలు గర్భందాల్చితే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అంటే ప్రసవకాలం సరిగ్గా వేసవికాలమన్నమాట.
 
వేసవిలో తల్లీబిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోడలిని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని కాళిదాసు మేఘసందేశం అనేకావ్యాన్ని రచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాశి ఫలితాలు (03-07-17) : రాజకీయాల్లో రాణిస్తారు...