Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాశి ఫలితాలు (03-07-17) : రాజకీయాల్లో రాణిస్తారు...

ఉద్యోగంలో శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. నూతన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపట్

రాశి ఫలితాలు (03-07-17) : రాజకీయాల్లో రాణిస్తారు...
, ఆదివారం, 2 జులై 2017 (23:01 IST)
మేషం
ఉద్యోగంలో శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య అనుమానాలు, అపార్థాలు చోటుచేసుకుంటాయి. నూతన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలపట్ల శ్రద్ధ వహిస్తారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించి పనులు పూర్తి చేస్తారు. 
 
వృషభం
ఉపాధ్యాయుల తొందరపాటుతనం వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. రాజకీయాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. వాహనచోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. 
 
మిథునం 
వస్త్ర, పచారీ, ఫ్యాన్సీ, స్టేషనరీ, మందుల, ఆల్కహాల్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆడిటర్లకు అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థుల నూతన పరిచయాలేర్పడతాయి. 
 
కర్కాటకం
అదనపు ఆదాయ మార్గాలపై మీ ఆలోచనలు ఉంటాయి. ఏ విషయంలోనూ తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా పూర్తికాగలవు. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఉపాధ్యాయులకు ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. 
 
సింహం
విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికం. బంధుమిత్రుల పట్ల సంయమనం పాటించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. రావలసిన మొండిబాకీలు సైతం వసూలు కాగలవు. వాహనయోగం వంటి శుభ ఫలితాలు పొందుతారు. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ వహించండి. 
 
కన్య
స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు, ఎంతో ముఖ్యం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
తుల
కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తలెత్తినాగానీ నెమ్మెదిగా సమసిపోతాయి. ఇతరుల ఆంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోకండి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం 
ఆర్థికస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆత్మీయులను మీ సమస్యలు తెలియజేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులకు ఒక అవకాశం అప్రయత్నంగా కలిసిరాగలదు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. నూతన దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
ధనస్సు 
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. తలపెట్టిన పనులు నిర్వఘ్నంగా పూర్తి చేస్తారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు కృషి ఫలిస్తుంది. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. 
 
మకరం 
ముఖ్యమైన విషయాలలో పెద్దల మాటను శిరసావహిస్తారు. ఆర్థికాభివృద్ధి పొందుతారు. ఏదన్నా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. అధికారులతో ఏకీభావం కుదరదు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారుల్లో పోటీతత్వం పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. 
 
కుంభం
వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. స్త్రీలు టీవీ, చానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. మీ సంతానం విషయంలో సంతృప్తికానవస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. 
 
మీనం
ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక రంగాల వారికి అశాజనకం. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారికి భుజకీర్తులు - విలువెంతో తెలుసా...!