ఉత్తమే క్షణ కోపస్యా
స్యధ్యమే ఘటికాద్వయమ్
అధమేస్యా దహోరాత్రం
పాపిష్ఠే మరణానంతకమ్
సాధారణంగా మంచివారికి కోపం రానేరాదు. వచ్చినా అది క్షణకాలమే వుంటుంది. మధ్యముని కోపం ఒక పూట వుంటే, అధముని కోపం కాలవ్యవధి-ఒకరోజు. కానీ దుర్మార్గుడి క్రోథం అనేది-పగతో కూడినదై చచ్చేంత వరకూ వుంటుంది. కనుకనే వారిని పాపిష్ఠులన్నారు.
గుణహీనుడిని చూసి..
పూలతో శోభిస్తూ బూరుగు చెట్టు ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. ఏం ప్రయోజనం? దానికి ఎవరి మెప్పూ లభించదు. ఆర్భాటంగా వుందని లోలోపల అనుకుని ఊరుకుంటారు. అలాగే గుణహీనుడ్ని చూసి ఏం ఆడంబరంగా వున్నాడితడు అనుకుంటారు. ఎలాంటి హంగూ లేకున్నా గుణవంతుడు గౌరవం పొందుతాడు.