Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గుల్ని తొక్కకూడదు.. నక్షత్రం, స్వస్తిక్, శ్రీ గుర్తులేస్తే? తులసి దగ్గర ఏ ముగ్గు వేయాలి?

పూర్వం ముగ్గు లేని ఇంట సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు భిక్షం కూడా అడిగేవారు కారట. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తుగా భావిస్తారట. అదే ఇంటి ముందు రంగ వల్లికలతో, ముగ్గులతో అలంకరిస్తే.. ఆ ఇంట

Advertiesment
What is the importance of Rangoli?
, శనివారం, 31 డిశెంబరు 2016 (12:01 IST)
పూర్వం ముగ్గు లేని ఇంట సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు భిక్షం కూడా అడిగేవారు కారట. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తుగా భావిస్తారట. అదే ఇంటి ముందు రంగ వల్లికలతో, ముగ్గులతో అలంకరిస్తే.. ఆ ఇంట సిరిసంపదలు వెల్లివిరిస్తాయి. ఇంటి ముందు.. గడప పైన.. గేటు ముందు ముగ్గులు వేస్తే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఇంట కొలువున్న లక్ష్మీదేవిని బయటకు వెళ్ళకుండా చూస్తాయి. 
 
ముగ్గువేసి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే, అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అందుకే ఏ దేవత పూజ చేసినా దైవాన్ని ఉంచే పీటపై చిన్న ముగ్గు, నాలుగు వైపులా రెండేసి గీతలు గీయాలని వారు చెప్తున్నారు. 
 
నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర, తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు. తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. 
 
దేవతా రూపాలను, ఓం స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదని.. ఒకవేళ వేస్తే వాటిని మాత్రం తొక్క కూడదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ.. అమ్మవారు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో.. ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం ఉండదని, దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పురాణాలు చెప్తున్నాయి. 
 
అలాగే వాకిట పండగ కొచ్చేస్తే నడవడానికి తావులేకుండా ముగ్గులు పెట్టేయకూడదు. అలాగే రోజూ ముగ్గులు వేయలేక పెయింటింగ్ వేస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి. నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి.. అప్పుడే ఇంట దేవతలు కొలువై వుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమావాస్య రోజున పున్నమి చంద్రుని చూసిన జనులు నశిస్తారు... పోతులూరి వీరబ్రహ్మం