Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీళ్లు మారరు... శ్రీవారి దర్శన సమయంలో అదే గందరగోళం...

శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 దాకా పరిమితి సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. సంప్రోక్షణ పూజాది కార్యక్రమాలకు మినహాయించి మిలిగిన సమయంలో దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. గత సమావేశంలో

వీళ్లు మారరు... శ్రీవారి దర్శన సమయంలో అదే గందరగోళం...
, గురువారం, 26 జులై 2018 (20:11 IST)
శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ జరిగే ఆగస్టు 11 నుంచి 16 దాకా పరిమితి సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది. సంప్రోక్షణ పూజాది కార్యక్రమాలకు మినహాయించి మిలిగిన సమయంలో దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. గత సమావేశంలో పూర్తిగా భక్తులను దర్శనానికి అనుమతించ కూడదని నిర్ణయించినా…. జనంలో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పాలక మండలి తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంది.
 
విఐపి బ్రేక్‌ దర్శనాలు, సిఫార్సు లేఖలు, రూ.300 ప్రత్యేక దర్శనాలు వంటివాటికి అనుమతి వ్వకుండా… తిరుమలకు వెళ్లి క్యూలైన్లలో నిరీక్షించే వారికి మాత్రమే దర్శనం కల్పిస్తామని అధికారులు వెల్లడించారు. భక్తులను దర్శనానికి అనుమతించాలని టిటిడి తీసుకున్న నిర్ణయం మంచిదేగానీ, అయితే ఈ నిర్ణయం అమలులో గందరగోళం చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మహా సంప్రోక్షణ రోజుల్లో రోజుకు 20 వేల నుంచి 30 వేలకు మించి దర్శనం చేయించే అవకాశాలు లేవు.
 
అటువంటప్పుడు ఆ 20 వేల మంది 30 వేల మంది ఎవరో ముందే తెలిస్తే మిగిలనవారు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు. ఇది తెలియాలంటే ముందే దర్శనం టికెట్లు జారీ చేయాలి. అలాకాకుండా తిరుమలకు వచ్చి క్యూలైన్‌లో కూర్చున్నవారికి దర్శనం కల్పిస్తామంటే…. అందరూ తమకు దర్శనం దక్కవచ్చన్న ఆశతో తరలిరావచ్చు. క్యూలైన్లు నిండిపోయి, భక్తులు రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి తలెత్తవచ్చు. ఏ రోజు ఎంతమందికి దర్శనం కల్పించే అవకాశం ఉందో అంత మందికి ఆన్‌లైన్‌లో టోకెన్లు ఇచ్చివుంటే సరిపోయేది. టోకెన్‌ లభించనివాళ్లు దర్శనానికి వచ్చేవాళ్లు కాదు. 
 
దర్శనం సాఫీగా సాగిపోయేది. సాంకేతికంగా ఉన్న ఈ వెసులుబాటును టిటిడి వినియోగించుకోలేదు. ఆన్‌లైన్‌ ద్వారా దర్శనం టికెట్లు ఇవ్వడానికి దేశ వ్యాపితంగా ఏర్పాట్లు ఉన్నాయి. మరెందుకనో దీనిపై ఆసక్తి చూపలేదు. 20 వేల మందికి దర్శన అవకాశాలు ఉన్నప్పుడు 50 వేల మందో 60 వేల మందో తిరుమలకు చేరుకుని నిరీక్షిస్తే… ఇబ్బందికరపరిస్థితులు తలెత్తడం ఖాయం. ఇప్పటికైనా అధికారులు ఇంకోసారి ఆలోచించి, మహాసంప్రోక్షణ దర్శనాలు సవ్యంగా సాగిపోయేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహం జరుగుతున్నట్లుగా కలవస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?