Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు... మునీశ్వరుడు...

మునీశ్వరులకు మాయలు, మంత్రాలు తెలుసుననే ఉద్దేశంతో ఒక యువకుడు ఒకరి దగ్గరకు వెళుతాడు. మునిని చూసి ఆయనకు నమస్కరించి స్వామి అంటూ మాటలు సాగించాడు. ఆ యువకుడు తాను పోయే దారంతా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండేలా వర

భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు... మునీశ్వరుడు...
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:02 IST)
మునీశ్వరులకు మాయలు, మంత్రాలు తెలుసుననే ఉద్దేశంతో ఒక యువకుడు ఒకరి దగ్గరకు వెళతాడు. మునిని చూసి ఆయనకు నమస్కరించి స్వామి అంటూ మాటలు సాగించాడు. ఆ యువకుడు తాను పోయే దారంతా ఎప్పుడూ వెలుగుతో నిండి ఉండేలా వరం ప్రసాందించాలని మునిని కోరాడు. అప్పుడు మునీశ్వరుడు ఓ లాంతరు ఇచ్చి దీన్ని తీసుకోమని ఆ యువకునికి ఇచ్చాడు.
 
ముని తనకున్న శక్తియుక్తులతో అద్భుతమైన ఓ దీపాన్ని ఇస్తాడనుకుంటే ఓ మామూలు లాంతరు ఇచ్చాడేమిటని ఆ యువకుడు తన మనసులోని మాటను అడిగాడు. స్వామీ మీరు మాయతో కూడిని విచిత్రమైన దీపాన్ని ఇస్తారనుకున్నాను. కానీ ఓ లాంతరు ఇచ్చారు, ఇది ఓ పది అడుగుల దూరం మించి వెలుగు చూపదు స్వామీ అని అన్నాడు. 
 
అప్పుడు మునీశ్వరుడు నేను తలచుకుంటే నాకున్న మాయాశక్తితో నువ్వు వెళ్ళే దారంతా వెలుగు నిండేలా చేయగలను. అయినా నీ కళ్ళు కూడా దాదాపు పది అడుగుల మేరకే చూడగలదు. కనుక ఆ మేరకు నీకు వెలుగుంటే చాలుగా అని అన్నాడు. నీవు పోయేకొద్ది తెల్లవారేసరికి అడవి మార్గాన్ని దాటి పొరుగున ఉన్న పల్లెకు చేరుకోగలవు. ఆ ఉద్దేశంతోనే నీకు ఆ లాంతరును ఇచ్చానన్నారు ముని. 
 
ఒక విధంగా ఇది నిజమే మనలో చాలా మంది ఆ యువకునిలాంటివారే. ఎంతసేపూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ వర్తమానాన్ని పట్టించుకోరు. మన ముందున్న కాలం ఏమిటో తెలుసుకోరు. ఉన్న కాలం గురించి ఆలోచించరు. వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. అందుకే అనుభవజ్ఞులనే మాట ఇదే.. ఈరోజు ఈ క్షణంలో చెయ్యవలసిన దానిని ఆచితూచి చెయ్యడంలో చైతన్యవంతులై ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిలాండ నాయకుని గరుడోత్సవం..