Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో తిరుప్పోనకం అంటే..?.. దీనికి పెద్ద చరిత్రే ఉందండోయ్...!

తిరుప్పోనకమా...! అదేమిటి ఈ పేరే ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారు కదూ. మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తిరుప్పోనకం తినే ఉంటారు.

Advertiesment
Tirumala Srivari Prasadam
, శనివారం, 3 డిశెంబరు 2016 (13:12 IST)
తిరుప్పోనకమా...! అదేమిటి ఈ పేరే ఎప్పుడూ వినలేదే అనుకుంటున్నారు కదూ. మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఉంటే ఎప్పుడో ఒకప్పుడు తిరుప్పోనకం తినే ఉంటారు. తిరుప్పోనకం అంటే ఏదో కాదండీ. నెయ్యితో చేసిన పొంగళి ప్రసాదమే. తిరుప్పోనకం అంటే తెలిసిపోయిందిలే అనుకుని చదవడం ఆపేమొద్దు. ఈ నేతిపొంగలికి చాలా చరిత్రే ఉంది. శాసనాల్లో లభించిన సమాచారం ప్రకారం.
 
అసలు తిరుమల ఆలయంలో స్వామికి నివేదిస్తున్న నేతి పొంగలి ఈనాటిది కాదు. వందల యేళ్ల క్రితం నుంచే స్వామివారికి నేతి పొంగలిని నైవేధ్యంగా పెడుతున్నారు. విజయనగర రాజుల కాలం నుంచి శ్రీవారి ఆలాయంలో తిరుప్పోనకం సమర్పించడం పెరుగుతూ వచ్చింది. విజయనగర రాజుల కాలంలో అనేక దేవాలయాలు పునరుద్ధరణ జరిగింది. కొత్తగా ఆలయాలు కట్టించారు. శ్రీవారి ఆలంయలో దీపాలకు బదులు నైవేథ్యాలు పెరిగాయి. స్వామివారి ముందు అన్నప్రసాదాలను కొండగా పోసి సమర్పించేవారు. 
 
ఇప్పుడు గురువారం మాత్రమే అలాంటి సేవ (తిరుప్పావడసేవ) నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రోజూ ఇదే విధంగా నైవేద్యం పెడుతున్నారు గానీ ఒకప్పుడు రోజులో సేవ సేవకూ మద్యలో అన్నప్రసాదాలను స్వామివారి సన్నిధిలో పర్వతంలా పోగు చేసి నైవేథ్యంగా సమర్పించేవారట. దీన్ని సంధిపూజ అని పిలిచేవారు. ఈ పూజలు రాజుల పేరుతో దాతల పేరుతో జరుగుతుండేవి. బుక్కరాయసంధి, గంగడోపాలుని సంధి, నరసింహరాయ సంధి, రాయల్‌ సంధి ఇలా అనేక పూజలు రోజూ నిర్వహించేవారట. అప్పుడు అన్నప్రసాదం స్వామికి నివేదించేవారట.
 
శ్రీవారి ఆలయంలో బుక్కరాయ సంధి తొలుత ఏర్పాటు చేశారట. ఈ సంధి పూజలో నెయ్యి పొంగలి అంటే బియ్యం, పెసరపప్పు, నెయ్యితో చేసే ప్రసాదం, దీన్నే తిరుప్పోనకం అంటారు. ఈ సంధిపూజ కోసం బుక్కరాయలు ఒక గ్రామాన్ని సర్వమాన్యంగా స్వామివారికి సమర్పించారట. రెండో దేవరాయలు వేంకటేశ్వరస్వామికి క్రీ.శ.1429 డిసెంబర్‌ 1200పాన్‌ బంగారు నాణేలు, 2,200 వరహానాణేలు సంధి నైవేద్యం ఏర్పాటు చేశారు. రాయల్‌ సంధి పేరుతో జరగే నైవేథ్యంలో రోజూ 30గంగాళాల అన్నప్రసాదాలు, ఒక గంగాళం పాయసం స్వామివారికి నైవేథ్యంగా సమర్పించేవారట. క్రీ.శ.1446 పెద్దజియ్యర్‌ మఠానికి చెందిన కోవిల్‌ కెల్వి ఎంబేరుమన్నార్‌ జియ్యర్‌స్వామి రెండు తిరుప్పోనకల్‌ ప్రసాదాలను స్వామివారికి నైవేథ్యంగా చేసేవారట. సంధిపూజ నైవేథ్యాలలో గృహస్తు భాగంగా వచ్చే వాటాను అప్పుడు తిరుమల ఉచిత భోజనశాలకు తరలించి పంచిపెట్టేవారట. 
 
ఒక గంగాళం నెయ్యి పొంగళిని రోజూ దాతల పేరుతో స్వామివారికి నైవేథ్యం చేయాలంటే వంద బంగారు నాణేలు లేదా వెయ్యి ఫణములు లేదా నార్‌ ఫణములు శ్రీవారి ఖజానాకు జమ చేయాలని ఆనాడు విధానంగా పెట్టారట. 14,15వ శతాబ్థాలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి, తిరుపతి గోవిందరాజస్వామివారికి నేతి పొంగలినే (తిరుప్పోనకం) అధిక మోతాదులో వినియోగించేవారు. 
 
స్వామివారికి నిత్య నైవేథ్యం కోసం డబ్బులు కట్టిన వారికి ప్రసాదంలో ఒకటి భై నాలుగో వంతు వచ్చేవారు. మిగిలిన 3 భై నాలుగవ వంతు ప్రసాదంలో ప్రసాదంలో 1/16 వంతు శ్రీ వైష్ణన ఏకాంగి తీసుకునేవారు. మిగిలిన ప్రసాదాన్ని దేవస్థాన స్థానత్తారులు 12మంది ఒక్కొక్కరు ఒక్కో భాగం తీసుకునేవారట. ఇలా చాలా శాసనాల్లో స్వామివారి నైవేథ్యాల గురించి సమాచారం కనిపిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహ సమస్యలు, అనారోగ్య సమస్యలు... నాగదోషం తొలగిపోవాలంటే...?