వివాహ సమస్యలు, అనారోగ్య సమస్యలు... నాగదోషం తొలగిపోవాలంటే...?
నాగదోషం ఉన్నవారికి వివాహం కాదని జ్యోతిష నిపుణులు చెపుతుంటారు. అందువల్ల నాగదోషానికి పరిహారం చేసుకోవాలి. 'కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం' ... ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడి స్వామి నెమలి వాహనాన్ని అధిష్టించి ఉండగా, ఆయన
నాగదోషం ఉన్నవారికి వివాహం కాదని జ్యోతిష నిపుణులు చెపుతుంటారు. అందువల్ల నాగదోషానికి పరిహారం చేసుకోవాలి. 'కుక్కె సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం' ... ఇది కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో ఉంది. ఇక్కడి స్వామి నెమలి వాహనాన్ని అధిష్టించి ఉండగా, ఆయన సన్నిధిలో ఆదిశేషుడు - వాసుకి దర్శనమిస్తూ ఉంటారు. ప్రశాంతమైన వాతావరణంలో నదీ తీరంలో అలరారుతోన్న ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
వివాహం విషయంలో సమస్యలు ... అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవాళ్లు, సంతాన సౌభాగ్యాలను కోరుకునేవారు ఈ స్వామిని దర్శిస్తూ ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని ఆయనకి పూజాభిషేకాలు జరిపించి ఆ రాత్రికి అక్కడ నిద్రచేస్తుంటారు.
మరునాడు మరలా ఆయన దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమవుతుంటారు. ఈ విధంగా సుబ్రహ్మణ్యస్వామి సన్నిధిలో నిద్ర చేయడం వలన నాగదోషాలు ... గ్రహ సంబంధమైన దోషాలు నశించిపోతాయని విశ్వసిస్తుంటారు.