Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naimisharanya: బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ సమక్షంలో నైమిశారణ్యంలో పూర్తయిన భాగవత సప్తాహం

Advertiesment
Book launch of Brahmasri Vaddiparthi Padmakar's ethical stories in the Bhagavatam

దేవీ

, బుధవారం, 10 సెప్టెంబరు 2025 (11:23 IST)
Book launch of Brahmasri Vaddiparthi Padmakar's ethical stories in the Bhagavatam
పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనాలు ఆదరణ పొందుతున్నాయనేది తెలిసిందే. మనషులు చేసే పాప కర్మాలకు ప్రాయశ్చితంగా భాగవత శ్రవణం, పఠనం కలియుగంలో ఎంతో ఉపమశన కలుగుతుందని ఆయన చెబుతుండేవారు. దేశవిదేశాల్లో శిష్య బ్రందాన్ని కలగడం కోసం పయనిస్తుండే ఆయన ఇటీవలే భారతదేశ యాత్ర నిర్వహించి పలు చోట్ల ప్రవచనాలు నిర్వహించి దిగ్విజయంగా పూర్తిచేశారు. 
 
webdunia
The Bhagavata scripture was placed on a golden throne and taken in procession
ఇటీవలే 5 రోజుల పాటు లక్ష్మీనారాయణ హోమం, ఒకరోజు సత్యనారాయణ వ్రతం ఒకరోజు పితృదేవతా కార్యక్రమములు ఒకరోజు రుక్మిణి కళ్యాణం ఒకరోజున గరుడ పురాణం పుస్తకావిష్కరణ, ఒక రోజు భాగవతంలో నీతి కథలు  పుస్తకావిష్కరణ నిర్వహించారు.
 
webdunia
Bhagavata Saptaham in the Naimisharanyam
మరొక రోజున దివ్యమైన భాద్రపద పూర్ణిమ తిధి నాడు సువర్ణ సింహాసనం పై భాగవత గ్రంథాన్ని ఉంచి ఊరేగించారు.  ప్రతిరోజూ శ్రీ గురుదేవుల ప్రవచనాలు రెండు పూటలా జరిగాయి. మహాలయ పక్షములు ఆరంభమైన మొదటి రోజున గ్రహణం వీడిన తదుపరి గోమతి నదములో స్నానం చేసేలా ప్రణాళిక రూపొందించిన శ్రీ గురుదేవులకు భక్తులు ప్రమాణాలు చేస్తున్నారు.
 
ఇవేకాక అనంత పద్మనాభ స్వామి వ్రతం, గోష్టి, గురుదేవుల సమక్షంలో భక్తులు సామూహిక గ్రహణ జపం చేసుకోగలిగారు. వాతావరణం పూర్తిగా అనుకూలించింది. నేపాల్ వెళ్తే బాగుండు అని అనుకునే వారికి ఎందుకు ఆ ప్రణాళిక పెట్టలేదు అని గురుదేవుల ముహూర్త బలం మరొకసారి మనకు తెలియజేస్తోంది. అందరూ క్షేమంగా గురుదేవుల ఆశీస్సులతో గమ్యస్థానాలు చేరారు. 
 
ఇంతటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు, శిష్యులకు, వాలంటీర్లకు, పక్క వారికి సాయం చేసిన ప్రతి ఒక్క వారికి అనేక నమస్సులు. ఏదైనా కార్యక్రమం విజయవంతమైంది అని అంటే అది కేవలం ప్రతి ఒక్కరి సహాయ సహకారములు ఉన్న రోజులు మాత్రమే. దానితోపాటుగా గురుబలం దైవ బలం మనం వెంటే ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం అయ్యేలా చేశాయి. 
 
గరుడ పురాణం మరియు భాగవత గ్రంథం ఊరేగింపు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి సువర్ణమూర్తులు బంగారు సింహాసనం వీటన్నిటిలో పాల్గొనకపోయినా వినినా, వీక్షించినా అదృష్టవంతులవుతారని గరుడపురాణంలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

TTD: అన్నప్రసాద సేవ కోసం కూరగాయల విరాళాలు.. డైనమిక్ వ్యవస్థ సిద్ధం