ప్రాణాయామం దేనికి? అక్షింతలు ఎందుకు వేస్తారు..!
మనస్సు చంచలమైనది. ఒక లక్ష్యం మీద నిలవకుండా చెదిరిపోతూ ఉంటుంది. ఏకాగ్రత అంటే మనస్సును లొంగదీసుకోవడమే. ఏ సాధనకైనా, ఏ కార్యసాధనకైనా ఏకాగ్రత అవసరం. పెద్దలు నిర్ణయించిన ప్రాణాయామం, యోగాసనాలు, ఏకాగ్రతకు దోహ
మనస్సు చంచలమైనది. ఒక లక్ష్యం మీద నిలవకుండా చెదిరిపోతూ ఉంటుంది. ఏకాగ్రత అంటే మనస్సును లొంగదీసుకోవడమే. ఏ సాధనకైనా, ఏ కార్యసాధనకైనా ఏకాగ్రత అవసరం. పెద్దలు నిర్ణయించిన ప్రాణాయామం, యోగాసనాలు, ఏకాగ్రతకు దోహదం చేస్తాయి. అంతేకాదు మంచి ఆలోచనల వైపు మనసును మళ్ళింపజేస్తాయి. అందుకు ప్రాణాయామం ఒక సాధనం.
వేదం మన బుద్ధికి అతీతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. యజ్ఞ యాగాదులు, ఉపాసనా పద్ధతులు, జీవాత్మ, పరమాత్మ, సంబంధం, పుట్టుక నుంచి మరణం వరకు మనిషి చెయ్యవలసిన కర్మలు. ఇవన్నీ వేదాలలో వివరించబడ్డాయి. అందుచేతనే యుగయుగాలుగా వేదమాత పూజలందుకొంటున్నది.
అక్షింతలు ఎందుకు వేస్తారంటే. క్షతమ్ అంటే కొరత ఉన్నదని అర్థం. అక్షతమ్ అంటే కొరతలేనిది నిండైనది సంపూర్ణమనదని అర్థం. జీవితంలో కొరత అన్నది లేకుండా పరిపూర్ణత్వం కలిగి జీవించాలని కోరుకుని ఆశీర్వదించడమే. అక్షింతలు చల్లడంలోని ఉద్దేశ్యం. బియ్యం పసుపు, మంగళ ప్రధానమైనవి. అందుకే ఆ రెండు కలిపి అక్షింతలు చేస్తారు.