Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురువారం నాడు తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం... ఏం జరుగుతుందో తెలుసా?

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో గురు, శుక్ర వారాలు ప్రత్యేకమని పురోహితులు తెలియజేశారు. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి, సజ్జనులుగా జీవిస్తారని విశ్వాసం.

గురువారం నాడు తిరుమల శ్రీవారి నేత్ర దర్శనం... ఏం జరుగుతుందో తెలుసా?
, గురువారం, 21 జూన్ 2018 (15:24 IST)
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో గురు, శుక్ర వారాలు ప్రత్యేకమని పురోహితులు తెలియజేశారు. గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి, సజ్జనులుగా జీవిస్తారని విశ్వాసం. ఈ రోజున ధవళ వస్త్రాలతో, నేత్ర దర్శనమిచ్చే వెంకన్న స్వామిని దర్శించుకునే వారికి మనోధైర్యం, భోగభాగ్యాలు, సిరిసంపదలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.
 
శుక్రవారం నాడు శ్రీవారికి ఆగమ శాస్త్రోక్తంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించే వారికి ఈతి బాధలు తొలగిపోయి శ్రీమన్నారాయణ, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ నాడు తిరుమల ఏడు కొండలపై శ్రీవారి నిజపాద దర్శనం చేసుకుంటే చాలా మంచిది. గురువారం స్వామి వారికి ధరించే ధవళ వస్త్రాలను తొలగించి అభిషేక, ప్రత్యేక పూజలకు అనంతరం పట్టు వస్త్రాధారణ జరుగుతుంది. దీనితో పాటు స్వామివారి నిజపాద దర్శనం కూడా జరుగుతుంది.
 
ఈ రోజున పట్టు పంచె, పట్టు తలపాగా, బుగ్గన చుక్కతో గోకుల విహారి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల కొంగు బంగారమైన వేంకటాచలపతి శుక్రవారం పూట దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని తితిదే పురోహితులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంట్లో తులసి చెట్టును ఏ దిశలో ఉంచుకోవాలంటే....