Publish Date: Sat, 08 Dec 2018 (21:42 IST)
Updated Date: Sat, 08 Dec 2018 (21:44 IST)
సంతానం లేనివారి బాధ వర్ణనానీతం. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనబడదు. ఐతే ఆధ్యాత్మికంగా కొన్ని చేస్తే ఫలితం
వుంటుందంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. అవేంటో చూద్దాం.
1. సంతానప్రాప్తి కోసం ఇష్టకామ్య సింధూర తిలకాన్ని ధరించండి. హనుమంతుని మందిరంలో రాగి దానం చేయండి.
2. సంతానప్రాప్తి కోసం గోధుమపిండి ఉండలుచేసి, వాటిలో కొద్దిగా శనగపప్పు, పసుపు కలిపి ఆవుకు తినిపించండి.
3. సంతానం కోసం బాధ పడుతుంటే, తోటపని చేయండి. కొత్తకొత్త మెుక్కలను నాటి, వాటి సంరక్షణ చేయండి.
4. ఇంటి బయటకు వచ్చి, నల్లని ఆవు చుట్టూ తలపై చెయ్యి ఉంచుకుని ప్రదక్షిణ చేయాలి. తప్పకుండా సంతానప్రాప్తి కలుగుతుంది.
5. స్త్రీలు ప్రతిరోజు రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తూ, అక్కడ దీపారాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది.
6. సంతానప్రాప్తి కలగాలంటే వెదురు మెులకలను తీసుకొని, దానితో శివలింగం చేసి పూజ చేయాలి. కొద్దికాలంలోనే సంతానప్రాప్తి కలుగుతుంది.