అలాంటి వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా వున్నా పోరాడగలడు...
సత్యం, పవిత్రత, నిస్వార్ధత- ఈ మూడూ ఎక్కడ ఉంటాయో.. అక్కడ సూర్యునికి పైన గాని క్రింద గాని ఉన్న ఏ శక్తులు పని చేయజాలవు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడగలడు. 2. పరోక్షంగా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడటం పాపం. దీనిని పూర
సత్యం, పవిత్రత, నిస్వార్ధత- ఈ మూడూ ఎక్కడ ఉంటాయో.. అక్కడ సూర్యునికి పైన గాని క్రింద గాని ఉన్న ఏ శక్తులు పని చేయజాలవు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడగలడు.
2. పరోక్షంగా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడటం పాపం. దీనిని పూర్తిగా విసర్జించాలి. మనస్సులో ఏమేమో తోచవచ్చు, కాని వాటిని బయట పెట్టటానికి ప్రయత్నిస్తే క్రమక్రమంగా అవి గోరంతలు కొండతలుగా తయారవుతాయి. క్షమించి మరచిపోతే అంతా సమసిపోతాయి.
3. ఇతరులు ఏమి తలచినా, ఏమి చేసినా సరే నీవు మాత్రం నీ పావనత్వాన్ని, నైతిక వర్తనను, భగవద్భక్తి యెుక్క స్థాయిని దిగజార్చకు.
4. పవిత్రత, సహనం, పట్టుదల- విజయాన్ని సాధించడానికి కావలసిన మూడు ఆవశ్యకాలు. వీటన్నింటికి మించి కావలసింది ప్రేమ.
5. నీవు పవిత్రుడవు, బలసంపన్నుడవు అయితే నీవు ఒక్కడవు అఖిల జగత్తుకు సమానుడవు అవుతావు.
6. పవిత్రత, నిశబ్దతల నుండే అమోఘ వాక్కు వెలువడుతుంది.
7. పవిత్రతే గొప్ప శక్తి. దాని ముందు మిగిలినదంతా బిత్తరపోతుంది.
8. నాయకుడిలో సౌశీల్యం లోపిస్తే విధేయతను పొందలేడు. సంపూర్ణ పవిత్రత కలకాలం నిలిచే విధేయతను, నమ్మికను పెంపొందిస్తుంది.