Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగుల చవితి : పుట్టకు పూజ చేస్తే ఏంటి ఫలితం?

Nagamma
, గురువారం, 27 అక్టోబరు 2022 (09:57 IST)
నాగుల చవితి రోజున నాగదేవతలకు పూజ చేయడం విశిష్ట ఫలితాలను పొందవచ్చు. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టలలో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పాలు పోస్తారు. 
 
చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తారు. ఎందుకంటే కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయి. 
 
ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆది శేషుడుగా తోడు ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని విశ్వాసం.
 
ముఖ్యంగా గమనించ వలసిన విషయం పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు. పాముకు పాలు అరగవు. పుట్టకు పాలుపోయలనుకునే వారు పుట్ట దగ్గర ఒక మట్టి కంచుడు లేదా దొప్పను పెట్టి అందులో పాలు పోయాలి. అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేయకూడదు. పాము విగ్రహాలను మాత్రం పాలతో అభిషేకం చేయవచ్చును. 
 
ఎవరైనా పుట్టకు కోడి గుడ్డు సమర్పించాలనుకునే వారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంద్రాలలో వేయకూడదు. పుట్టపై బియ్యం పిండిలో చక్కర కలిపి పుట్టపై చల్లాలి. దీని వలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది. 
 
సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడి మట్టిని కొంత తన చేతితో తీసుకుని పొట్ట భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలకు చక్కటి తరుణోపాయమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-10-2022 గురువారం దినఫలాలు - పంచముఖ ఆంజనేయుని తమలపాకులతో పూజిస్తే.. .