Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే... షిర్డీసాయి ( వీడియో)

శ్రీ గురుగీత, సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం సచాన్యోస్థి అంటే గురువు ఖల్విదం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చేబుతున్నాయి. దీనినే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే, ఆభగవంతుడే తానైనవాడు మాత

మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే... షిర్డీసాయి ( వీడియో)
, గురువారం, 4 జనవరి 2018 (17:32 IST)
శ్రీ గురుగీత, సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం సచాన్యోస్థి అంటే గురువు ఖల్విదం బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చేబుతున్నాయి. దీనినే ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే, ఆభగవంతుడే తానైనవాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపము దర్శనమిచ్చినట్లే, రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి త్రివిక్రమభారతి యనే సన్యాసికి గూడా ప్రసాదించారు. 
 
ఈ కాలంలో అజ్ఞులైనవారికి స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులే కాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలు కూడా తమ రూపమేనని తెల్పినవారు శ్రీ సాయి ఒక్కరేనేమో. సాయి అన్ని రూపాలలో తానే వున్నానని తన వద్ద ఉన్న భక్తులకు తేలియజేసాడు. శిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలగొన్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మశీదులో సాయి ఆమెతో తల్లీ నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు, కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో నేను మీకెప్పుడన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టెవేసిన కుక్కను నేనే.
 
అన్ని జీవులు రూపాలలోనూ నేనే ఎప్పుడూ వుంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు, నీకు ఎంతో మేలవుతుంది. మశీదులో కూర్చుని నేనెన్నడూ అబద్దం చెప్పను అన్నారు బాబా. ఒక మహాశివరాత్రి నాడు దాసగణు గోదావరిలో స్నానం చేసి రాదలచి, సాయి అనుమతి కోరాడు. సాయి గణూ అందుకోసం అంతదూరం వెళ్ళాలా శ్రద్ధాభక్తులుంటే ఆ తీర్థాలిక్కడే వున్నాయి లేకుంటే అక్కడాలేవు అన్నారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తన పాదాల వద్ద వుంచమన్నారు. 
 
సన్నని దారగా అతని దోసిలి నిండుగా తీర్థమొచ్చింది. అతడు ఆ నీరు తీసుకొని క్షణమాలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు. బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు. ఆయన సమాధి చెందాక దాసగణు మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి... ''మూర్ఖడా... సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థ జలాన్ని, ఆయన ముస్లిమన్న సంకోచంతో శిరస్సును దరించావు కాని, నోటిలో పోసుకోలేదుగదా నీకెన్ని జన్మలకైనా మరలా అట్టిది లభిస్తుందా. అంతటి మహానీయుడు మరల దొరుకుతాడా" అని మందలించారు. అంటే అన్ని రూపాలలో తానే వున్నాను అని నిరూపించారు. ఆకలిగొన్న జీవికి అన్నం పెట్టటం వలన మనకు మంచి జరగుతుంది అని వారి భావం. మనం చేసే పని మీద మనకు శ్రద్దాభక్తులు వుండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 31న శ్రీవారి ఆలయం మూసివేత.. ఎందుకంటే?