Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నూతన గృహం ముందు లక్ష్మీ గవ్వలు కడుతుంటారు... ఎందుకు?

క్షీర సాగరమథనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాలాహలం ఉద్భవించాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప

నూతన గృహం ముందు లక్ష్మీ గవ్వలు కడుతుంటారు... ఎందుకు?
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (17:03 IST)
క్షీర సాగరమథనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాలాహలం ఉద్భవించాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి. గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరిసోదరులని అంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీగవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటుంది.
 
మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అలమరాల్లో పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీ గవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధాన్యాలు వృద్ధి చెందుతాయి. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు. 
 
శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు. వాహనాలకు నల్లనిత్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు. భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం. పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు పెట్టేప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజురోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి.
 
వివాహ సమయామలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది. పసుపురంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజురోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారు పేరు తిండి మెండయ్య...! స్వామివారు భోజన ప్రియుడు.. సగం పగిలిన మట్టిపెంకులోనే భోజనం...