Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ శ్రీరాముడే తమ ఇంట జన్మించాడని మురిసిపోయారు

Advertiesment
Samartha Ramadasu
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (21:29 IST)
కొంతమంది భక్తులను దేశరక్షణ నిమిత్తం దేవుడే వారిని సృష్టిస్తాడు. అలాంటి భక్తుల కోవలోవాడే భక్తరామదాసు. అంతేకాదు ఇతడు శ్రీరామునికి వరపుత్రుడు. ఈ రామదాసు గురించి మనము తెలుసుకుందాము. ఇతడు మహారాష్ట్ర్రలో జాంబ్ అనే కుగ్రామంలో సూర్యాజీ, రణూబాయి అనే పుణ్యదంపతులకి జన్మించాడు. వీరు నిరంతరం దైవనామ స్మరణలో గడిపే వారు. వీరికి గంగాధరుడు, నారాయణ అనే ఇద్దరు కుమారులు
కలరు.
 
1530వ సంవత్సరంలో చైత్రమాసం శుద్ధనవమి రోజున ఊరిలో శ్రీరాముని ఉత్సవాలు జరుగుతున్న సమయంలో, సరగ్గా శ్రీరాముడు జన్మించిన మధ్యాహ్న వేళ 12 గంటల సమయాన ఈ రెండో కొడుకు నారాయణ జన్మించాడు. అంతులేని ఆనందంతో సూర్యాజీ దంపతులు సాక్షాత్ ఆ శ్రీరాముడే తమ ఇంట జన్మించాడని మురిసిపోయారు. కొంతకాలం తరువాత సూర్యాజీ మరణించాడు.
 
పెద్దకుమారుడు గంగాధరుడు కుటుంబ బాధ్యతను వహించాడు. కొద్దిమంది విద్యార్థులను చేరదీసి వారికి పాఠాలు చెప్పటం మొుదలుపెట్టాడు. ఒకరోజు నారాయణ తనకూ మంత్రోపదేశం కోరగా గంగాధరుడు నువ్వింకా చిన్నపిల్లవాడువు కొంతకాలం ఆగు అనిచెప్పాడు. ఆరోజు శ్రీరామచంద్రుడు తన అన్నగారికి కలలో కనిపించి నారాయణ పేరును రామదాసుగా మార్చమని చెప్పాడు.
 
ఆ విషయాన్ని తమ్ముడికి చెప్పగా కోపంతో ఇల్లు వదలి దూరంగా పోయి ఒక అంజనేయస్వామి ఆలయంలో నిద్రించాడు. ఆ రాత్రి కలలో శ్రీరాముడు కనిపించి ధర్మాన్ని రక్షించటానికి అవతరించావు నిరాశపడకు. నీవు చేయాల్సినది ఎంతోవుందన్నాడు. నాటి నుండి శ్రీరాముని భక్తునిగా మరాడు. తన పేరును రామదాసుగా మార్చుకున్నాడు. కేవలం 8 సంవత్సరాల వయస్సులోనే బైరాగిగా మారాడు.
 
కొద్దికాలంలోనే రామదాసు అనేక గ్రంధాలు, పురాణ, ఇతిహాసాలు చదివాడు. ధర్మసూక్ష్మాలు గ్రహించాడు. పన్నెండు సంవత్సరాలు వచ్చేసరికి రామదాసు చక్కని ముఖ వర్ఛస్సుతో, పాండిత్యంతో ఆజానుబాహునిగా ఠీవిగా ఉండేవాడు. రామదాసుకు ఇష్టంలేకపోయిన తల్లి బలవంతంగా వివాహం నిశ్చయించింది. అయితే పెండ్లిపీటల మీద కూర్చున్నా రామదాసుకు రాముడు, హనుమంతుడు జ్ఞాపకం వచ్చారు. వారు తనకు బోధించిన విషయాలు జ్ఞప్తికి వచ్చాయి.
 
ఒక్కసారిగా పెండ్లి పీటల నుంచి లేచి బైటకు వెళ్ళిపోయినాడు. రాముడు వనవాసం చేసిన పంచవటికి వెళ్లి దానికి సమీపంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు ప్రారంభించాడు. ఈవిధంగా కొన్ని సంవత్సరాలు గడిచాక రామాయణాన్ని స్వయంగా వ్రాసుకున్నాడు. ఒకసారి గోదావరిలో స్నానం చేసి వస్తుండగా ఒక స్త్రీ వచ్చి రామదాసు కాళ్ళకు నమస్కారం చేసింది. యధాలాపంగా రామదాసు సౌభాగ్యవతీభవ అని దీవించాడు.
 
భర్త అంతకుముందే మరణించగా అక్కడ దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అది గమనించిన రామదాసు తన నోటి వెంట ఆమాట రాముడే పలికించాడని భావంచి వెంటనే త్రయోదశాక్షరిని జపిస్తూ ఆ శవంపై నీళ్ళు జల్లాడు. మరణించిన యువకుడు లేచి కూర్చున్నాడు. భార్యభర్తలిద్దరూ వెంటనే రామదాసు కాళ్ళ మీద పడి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అన్నారు.
 
రామదాసు ఇలా పలికారు.. మీకు పుట్టిన మొదటి బిడ్డను నాకు అప్పగించండి. అలాగే ఆ దంపతులు వారి మొదటి బిడ్డను వారికి అప్పగించారు. ఆ బిడ్డకు ఉద్దవుడు అని పేరు పెట్టి పెంచసాగాడు. ఆ సమయంలో మన దేశం మొఘలు చక్రవర్తుల పాలనలో ఉండేది. దేశంలో అరాచకం పెరిగి, ధర్మాన్ని రక్షించేవారు ఎవరూ లేరు. రామదాసుకి ఆవేశం పెల్లుబికింది.
 
మళ్ళీ స్వరాజ్యాన్ని, స్వధర్మాన్ని నెలకొల్పాలని నిశ్ఛయించుకొన్నాడు. పెరిగి పెద్దవాడైన తన శిష్యుడు ఉద్ధవుడితో కలసి దేశ పర్యటనకు వెళ్ళాడు. వెళ్ళిన ప్రతిచోటా ఒక ఆంజనేయస్వామి దేవాలయం ప్రక్కనే ఒక వ్యాయామశాల కూడ నిర్మించేవాడు. దేవుని సేవించటం ఎంత అవసరమో, శరీరాన్ని ఆరోగ్యకరంగా, దృఢంగా ఉంచుకోవడం కూడా అంతే అవసరం అని చెప్పేవాడు.
 
ప్రజలను నీతిగా బ్రతకమని బోధించేవాడు. వ్యాయామశాలలు స్థాపంచటం వలన దేశవ్యాప్తంగా రామదాసు శిష్యులు తయారయ్యారు. ధర్మసంస్థాపన కొరకు తన ఆశయ సిద్ధి కొరకు ఒక వ్యక్తి అవసరం ఉందని గ్రహించాడు. అటువంటి వ్యక్తి కోసం వెతుకుతుండగా శవనేరి దుర్గంలో ఆ వ్యక్తి తారసపడ్డాడు. అతడు ఎవరోకాదు వీర శివాజీ. వారిరువురి కలయక దేశంలో పెనుమార్పుకు నాంది అయంది. శివాజీ ధర్మ సంస్థాపకై సాగించిన పోరాటానికి సమర్థ రామదాసు అతని శిష్యులు ఎంతగానో సహాయిపడ్డారు.
 
శివాజీ అతని కాలంలో సాధించిన విజయాలకు రామదాసు పాత్ర ఎంతో ఉంది. శివాజికి పట్టాభిషేక ముహూర్తం పెట్టి తాను మాత్రం తన ఆశ్రమంలో శ్రీరాముడు ధ్యానంలో గడిపాడు. 1603 సంవత్సరం మాఘ శుద్ద నవమి నాడు శ్రీరామునిలో ఐక్యమైనాడు. ఆ మహానుభావుడు రచించిన దాసబోధ నేటికీ మహారాష్ట్రలో ప్రతి ఇంటా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే బంపర్ ఆఫర్... ఆ పని చేస్తే భక్తులకు ఉచిత దర్శనం...