శివజ్ఞాన సాధనం.. రుద్రాక్షధారణం..?

మంగళవారం, 8 జనవరి 2019 (10:38 IST)
కంఠసీమను ముప్పైరెండు తలపైన నలభై, చెవులకు ఆరారు, చేతులకు పండెండ్రు, బాహువులను పదునారు, నేత్రయుగళిని ఒక్కటొకటి, శిఖయందు ఒకటి, ఉరమందు నూటయెనిమిది రుద్రాక్షలు ధరించినవాడు సాక్షాత్రు నీలకంఠుడు. వెండితోగాని, బంగారంతో గాని పొదిగి రుద్రాక్షలు ధరించాలి.
 
రుద్రాక్షధారణం ఊరికే చేయరాదు. ప్రణవ పంచాక్షరంతో ధరించాలి. రుద్రాక్షధారణం సాక్షాత్తు శివజ్ఞాన సాధనం. శిఖయందు తారతత్వాన్ని, చెవులయందు దేవదేవిని, యజ్ఞోపవీతమందు వేదాలను, చేతియందు దిక్కులను, కంఠమందు సరస్వతిని, అగ్నిని, భావించి రుద్రాక్షలు ధరించాలి. 
 
అన్ని వర్ణాలవారూ రుద్రాక్షధారణం చేయవచ్చు. కాని ద్విజులు మాత్రం సమంత్రాకంగా ధరించాలి. సర్వావస్థలయందునూ రుద్రాక్షధారణం వలన సర్వపాప విముక్తి కలుగుతుంది. రుద్రాక్షధారి తిన్నా, త్రావినా, ఆఘ్రాణించినా అది సాక్షాత్తూ శివుడు చేసినట్లేకాగలదు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 08-01-2019 మంగళవారం దినఫలాలు - మీ మనోభావాలు బయటికి వ్యక్తం...