ఇంటి దేవతలను పూజించడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. పుణ్యతీర్థాల్లో స్నానమాచరించినా.. పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నా.. ఇంటి దేవతకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని వారు అంటున్నారు. ఇంటి దేవతను పూజించి.. ఏ కార్యాన్నైనా ప్రారంభిస్తే.. ఆ కార్యం దిగ్విజయం అవుతుందని వారు చెప్తున్నారు. ఇంటిదేవతను పూజించడం ఈతిబాధలు వుండవు. రుణబాధలుండవు.
ఇంటి దేవతను పూజించిన తర్వాతే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఇంటి దేవతా పూజతోనే సకల పుణ్యఫలం లభిస్తుందని వారు చెప్తున్నారు. అందుకే మాసానికి ఓసారైనా ఇంటిదేవతను నిష్ఠతో పూజించాలి.
సంవత్సరానికి ఒక్కసారైనా ఇంటి దేవతను పూజించాలి. అభిషేకం, అర్చన చేయాలి. ఇంటి దేవతా ప్రతిమను, ఫోటోను పూజగదిలో వుంచి పూజించడం మరిచిపోకూడదు. ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. సకలసంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.