Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అద్దాల గదిలో కుక్కలాంటి మనస్తత్వం వుంటే అంతేసంగతులు...

మనం కోరుకున్న కోరికలు, ఆశలు నెరవేరడానికి ఏదో ఒకటి చేసి దక్కించుకోవాలని కొందరు అనుకుంటారు. మరికొందరు మన కోరుకున్నది మంచిదైతే అది వెంటనే జరుగుతుందిలే అని తేలికగా వదిలేస్తారు. కనుక మనస్తత్వమే మంచిచెడులను నిర్ణయిస్తుంది. మనం మంచిగా ఉంటేనే అందురూ మనకు మంచ

అద్దాల గదిలో కుక్కలాంటి మనస్తత్వం వుంటే అంతేసంగతులు...
, గురువారం, 27 సెప్టెంబరు 2018 (15:12 IST)
మనం కోరుకున్న కోరికలు, ఆశలు నెరవేరడానికి ఏదో ఒకటి చేసి దక్కించుకోవాలని కొందరు అనుకుంటారు. మరికొందరు మన కోరుకున్నది మంచిదైతే అది వెంటనే జరుగుతుందిలే అని తేలికగా వదిలేస్తారు. కనుక మనస్తత్వమే మంచిచెడులను నిర్ణయిస్తుంది. మనం మంచిగా ఉంటేనే అందురూ మనకు మంచిగా కనిపిస్తారు. ఈ కథను చూస్తే మీకు తెలుస్తుంది.
   
 
ఓ నాడు కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన మ్యూజియంలోనికి వచ్చింది. అప్పుడు అక్కడ ఎవ్వరు లేరు. అయితే ఆ హాలు నిండా అద్దాలే ఉన్నాయి. అప్పుడు ఆ కుక్కకి తన చుట్టూ చాలా కుక్కలు ఉన్నట్లనిపించింది. అది నిజమేనని అనుకుని వాటిని భయపెట్టడానికి పళ్లు బయటపెట్టి గట్టిగా అరిచింది. అయినా కూడా ఆ కుక్క ఎలా ఉందో మిగిలిన కుక్కలు కూడా అలానే ఉన్నాయి. 
 
కుక్క మళ్లీ గట్టిగా అరిచింది. ఈ శబ్దంతో ఆ గది మరింత ప్రతిధ్వనించింది. కుక్క అద్దాల దగ్గరికి వెళ్లగానే ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్లుగా అనుకున్నది. దాంతో రాత్రంతా అలానే గడిచింది. ఉదయాన్నే ఆ మ్యూజియం వాళ్లు వచ్చి చూడగానే కుక్క దెబ్బలతో చనిపోయే స్థితిలో ఉన్నది. మ్యూజియం వాళ్లు ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయని ఆశ్చర్యపోయారు. 
 
అసలు నిజం చెప్పాలంటే ఆ కుక్క ఆ అద్దాలలో తనని చూసి తానే భయపడిపోయింది. అక్కడ చాలా కుక్కలున్నాయనుకుని తనపై తానే దాడి చేసుకున్నది. అంటే మనకు ఏం జరుగుతుందోనని భయంతోనే ఆ కుక్క అలా చేసుకుంది. దీన్నిబట్టి ఏం అర్థమైయినదంటే మన ముందు వెనుక గలది మనమేనని తెలుసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరన్నవరాత్రులు.. సమర్పించాల్సిన పుష్పాలు, నైవేద్యాలు