Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కృష్ణా నది మధ్య బంగారు తేరు పుడుతుంది... అది చూసిన వారు... బ్రహ్మంగారి కాలజ్ఞానం మరికొన్ని...

బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబ. ఆయన జీవితకాల నిర్ణయం సరిగా లేకున్నా క్రీస్తు శకం 1608లో జన్మించారు. మరికొందరు ఆయన క్రీ.శ 1518లో జన్మించారు అని అంటారు. ఆయనన

కృష్ణా నది మధ్య బంగారు తేరు పుడుతుంది... అది చూసిన వారు... బ్రహ్మంగారి కాలజ్ఞానం మరికొన్ని...
, మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (15:48 IST)
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబ. ఆయన జీవితకాల నిర్ణయం సరిగా లేకున్నా క్రీస్తు శకం 1608లో జన్మించారు. మరికొందరు ఆయన క్రీ.శ 1518లో జన్మించారు అని అంటారు. ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది.
 
ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానభోద చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని దానిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరుతారు బ్ర‌హ్మంగారు.
 
అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని విశేషాలు...
* రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టులవుతారు.
* శాంతమూర్తులకు కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు.
* పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు వస్తుంది.
* బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
* చోళ మండలం నష్టాలపాలౌతుంది.
* వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి- కొడుకును, కొడుకు- తండ్రిని దూషిస్తారు.
* ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు. కొండలు మండుతాయి.
 
* జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
* దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
* మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
* అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
* నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు( జల విద్యుచ్చక్తి).
* మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు. (నాగమ్మ ఉదంతం)
* పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
* ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
* వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
* ఐదు వేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
* చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి.
* కృష్ణా నది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసిన వారికి కండ్లు పోతాయి.

Share this Story:

Follow Webdunia telugu